Telangana Politics : హీటెక్కుతున్న ఖమ్మం పాలిటిక్స్ .. పొంగులేటిపై మూడు పార్టీల ఫోకస్ .. మరి ఏ గూటికి చేరతారో?

కొంతకాలంలో టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ..ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఖమ్మం రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్న పొంగులేటిపై మూడు పార్టీలు ఫోకస్ పెట్టాయి.

Telangana Politics : హీటెక్కుతున్న ఖమ్మం పాలిటిక్స్ .. పొంగులేటిపై మూడు పార్టీల ఫోకస్ .. మరి ఏ గూటికి  చేరతారో?

All parties including brs, bjp, congress focus on khammam With Ponguleti Srinivas reddy

Telangana Politics :  కొంతకాలంలో టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ..ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఖమ్మం రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్న పొంగులేటిపై మూడు పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఇప్పుడిప్పుడే తెలంగాణలో సీట్లు మెరుగుపరుచుకుంటున్న బీజేపీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తెలంగాణలో మొత్తం పట్టు కోల్పోయిన కాంగ్రెస్ తో పాటు కొత్తగా పార్టీ పెట్టిన షర్మిల కూడా పొంగులేటిని పార్టీలో చేర్చుకోవటానికి యత్నిస్తున్నాయి. ఖమ్మంలో మంచి పట్టున్న నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవాలని ఉబలాటపడుతున్నాయి. పొంగులేటిని పార్టీలో చేర్చుకుంటే ఖమ్మంలో గెలుపు సాధించవచ్చని మూడు పార్టీలు భావిస్తున్నాయి. పొంగులేటి వర్గీయులు కాంగ్రెస్ లో చేరితే బాగుంటుందని భావిస్తున్నారు.

కానీ పొంగులేని ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారో అనేది హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ఎస్ కు గుడ్ చెప్పటం ఖాయంగా ఉన్న పొంగులేటి బీజేపీలో చేరతారు అనే వార్త హల్ చల్ చేసింది. కానీ పొంగులేటి మాత్రం తాజాగా వైఎస్సార్ టీపీ అధినేతి వైఎస్ షర్మిలతో భేటీ కావటం విశేషంగా మారింది.షర్మిల కూడా పొంగులేటిని పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు. పొంగులేటి గతం ఏంటో..ఆయన గత గుర్తుంచుకోవాలి అంటూ హింట్ ఇస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంలోనే పాలేరు నుంచి బరిలో నిలుస్తానని షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఖమ్మంలో బలహీనంగా ఉన్న టీఆర్ఎస్ అక్కడ కూడా పట్టు సాధించటం కోసం టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారాక తొలి బీఆర్ఎస్ సభ ఖమ్మంలోనే నిర్వహించటం స్థానిక పట్టుకోసమేనని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ కూడా ఖమ్మంలో క్లీన్ స్వీప్ చేసి సోనియా గాంధీకి కానుకగా ఇస్తామని ప్రటించింది. ఇలా బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ టీపీ ఖమ్మంపైనా ముఖ్యంగా పొంగులేటిపైనా ఫోకస్ పెట్టాయి.

బీఆర్ఎస్ హైమాండ్‌పై తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతున్న్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. షర్మిలతో సమావేశం కావటం, ఉమ్మడి ఖమ్మంతో పాటు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పొంగులేటికి షర్మిల భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. పార్టీలో చేరితే సముచిత స్ధానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. పార్టీలు మారే క్రమంలో రాజకీయాల గురించి పూర్తిగా అవగాహన ఉన్న పొంగులేటి కొన్ని షరతులను విధించారని.. వాటికి షర్మిల అంగీకరిస్తే.. వైఎస్ఆర్టీపీలో చేరిక లాంఛనమేనన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరి పొంగులేటి ఏ పార్టీలో చేరనున్నారో వేచి చూడాలి..

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం చుట్టే తిరుగుతున్న క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ఖమ్మంపై ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. దీంతో ఖమ్మంలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. అధికార బీఆర్ఎస్ తో పాటు తెలంగాణలో అధికారం సాధించాలని టార్గెట్ పెట్టుకున్న జాతీయ పార్టీ బీజేపీ, అలాగే కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి సాధించుకోవటానికి కాంగ్రెస్, రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఏపీపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి అక్కడ విజయం సాధించి తెలంగాణలో కుదేలైపోయిన టీడీపీ కూడా తెలంగాణలో రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. అలాగే వైఎస్సార్‌ తెలంగాణ పార్టీతో సత్తా చాటాలని చూస్తున్న వైఎస్ షర్మిల.. ఖమ్మంపై ఫోకస్‌ చేసి వ్యుహాలు రచిస్తున్నారు.

ఖమ్మంలో చంద్రబాబు సభ, పాలేరు నుంచి బరిలో నిలుస్తానని షర్మిల ప్రకటన, బీఆర్ఎస్ తొలి సభకు ఖమ్మం వేదికగా నిలవడం, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పుల వార్తలు.. మొత్తంగా కలిపి ఖమ్మం రాజకీయాల్ని హీటెక్కిస్తున్నాయి. దీంతో అన్ని పార్టీల దృష్టి ఖమ్మంపైనే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దులోను ఇంకా చెప్పాలంటే ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలో ఉంది అనే కంటే ఏపీకి చెందినట్లుగానే అక్కడి రాజకీయాలు సంప్రదాయాలు ఉంటాయి..ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారడం వెనక చాలా కారణాలు వినిపిస్తున్నాయి..కనిపిస్తున్నాయి..