మిడతలతో మనుషులకు ప్రమాదం లేదు…రైతులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

  • Edited By: srihari , May 28, 2020 / 12:59 PM IST
మిడతలతో మనుషులకు ప్రమాదం లేదు…రైతులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

మిడతలదండు తెలంగాణ వైపు దూసుకొచ్చే అవకాశాలున్నాయని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మిడతలతో ప్రజలు ఎలాంటి ప్రమాదం లేదని..రైతులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పచ్చని పంటలు, కూరగాయలను నాశనం చేస్తాయని చెప్పారు. డప్పుల సప్పుడు, టపాసులు కాల్చి పొగపెట్టి మిడతలను తరిమికొట్టవచ్చొన్నారు. అలాగే రసాయనాలను స్ప్రే చేసి పంటలను రక్షించుకోవచ్చన్నారు. మిడతల దండు నుంచి ఎవరికి వారే రక్షించుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. 

మరోవైపు ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో మిడతల కలకలం నెలకొంది. భారీ సంఖ్యలో మిడతలు వచ్చాయి. జిల్లేడు చెట్ల ఆకులు తినేయడంతో మిడతల దండు వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. మిడతల దండు ఒక్కసారిగా రాయదుర్గంపై దండెత్తడంతో ప్రజల్లో భయాందోళను గురవుతున్నారు. గంట ముందు రాయదుర్గం పట్టణానికి చేరుకున్న మిడతలు జిల్లేడు చెట్టుపై వాలి పది నిమిషాల్లో జిల్లేడు చెట్టు ఆకులను మొత్తం తినేయడంతో మిడతలు పంట పొలాల మీద కూడా వాలి పంటను నాశనం చేసే విధంగా ఉంది. 

మిడత దండు వచ్చి పంటలను నాశనం చేయడం గతంలో టీవీల్లో చూశాం కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని, ఇంత భయకరంగా ఉంటుందని ఎప్పుడూ చూడలేదని రైతులు అంటున్నారు. పట్టణంలో ఉన్న మిడతల మొత్తం కొద్ది సేపట్లో పంట పొలాలపై వ్యాపించే విధంగా ఉంది. వందల సంఖ్యలో గుంపులు గుంపులుగా ఒకేసారి రావడంతో ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. 

కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత్ కు ఇప్పుడు మిడతల దండు రూపంలో మరో ప్రమాదం వచ్చి పడింది. దండులుగా వచ్చి పడుతున్న మిడతలతో వందల హెక్టార్ల ఎకరాల్లో పంటు క్షణాల్లో మాయం అయిపోతోంది. దీంతో రైతులు లబోదిబోంటున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మరియు మహారాష్ట్ర ప్రాంతాలన్నింటినీ ధ్వంసం చేసిన మిడుతల దండులు ఢిల్లీవైపుగా కూడా వస్తున్న వాటిని గురించి పర్యావరణవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ సంవత్సరం ప్రపంచ మహమ్మారి కరోనాకు తోడు ఈ మిడతల దండు మరొక విపత్తు కావచ్చని అభిప్రాయపడ్డారు. గ్రామాల వినాశనానికి ఇవి కారణమవుతున్నాయని..కొన్నొ వార్తాపత్రికలు ఈ మిడతలు ప్లేగు వంటివాటికి కూడా కారణమవుతాయని ప్రచురిస్తున్నాయి. 

ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ నివేదిక ప్రకారం 1900 నుంచి కొన్ని దశాబ్దాలకు మిడుతల దండు దాడులు జరుగుతున్నాయని తెలిపింది. 1926, 1931 మధ్య ఐదేళ్లలో మిడతల దండు రూ.2 కోట్ల విలువైన పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపింది. తీవ్రంగా పశుగ్రాసం దెబ్బతిందనీ దీంతో భారీ సంఖ్యలో పశువులు మరణించాయని తెలిపింది.