Jagga reddy : బీజేపీ కేంద్ర కమిటీ డైరెక్షన్‌లో టీఆర్ఎస్ నడుస్తోంది.. యాసంగిలో వరిసాగు చేయని రైతులకు పరిహారం ఇవ్వాలి

బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటేనని, బీజేపీ కేంద్ర కమిటీ డైరెక్షన్‌లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నడుస్తోందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు మల్లకుండా బీజేపీ వైపు మల్లించేలా ...

Jagga reddy : బీజేపీ కేంద్ర కమిటీ డైరెక్షన్‌లో టీఆర్ఎస్ నడుస్తోంది.. యాసంగిలో వరిసాగు చేయని రైతులకు పరిహారం ఇవ్వాలి

Jagga Reddy

Jagga reddy : బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటేనని, బీజేపీ కేంద్ర కమిటీ డైరెక్షన్‌లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నడుస్తోందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు మల్లకుండా బీజేపీ వైపు మల్లించేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడున్నర సంవత్సరాల్లో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై కాంగ్రెస్ పక్షాన పోరాటాలు ఉదృతం చేయాలని రాహుల్ గాంధీ సూచించారని జగ్గారెడ్డి తెలిపారు.

Jagga reddy: మంత్రి పువ్వాడ అజయ్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి

రైతు రుణమాఫీ‌పై కేసీఆర్ మాట తప్పారని, టిఆర్ఎస్ పాలనలో రైతులకు సబ్సిడీలు లేక ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో పంటలకు గిట్టుబాట ధర లేదని, సీఎం మాటలు నమ్మి వరి వేయని రైతుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. కేసీఆర్ వరి సాగుచేయొద్దని చెప్పాడని నీటి సౌకర్యం ఉన్నా వరిపంట వేయకుండా ఖాళీగా ఉంచుకున్నారని, ఇప్పుడు కేసీఆర్ వడ్లు కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టారని అన్నారు. సీఎం కేసీఆర్ మాటవిని వరి పంట సాగుచేయకుండా పంటపొలాలను బీడ్లుగా మార్చుకున్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ లో జరిగే రాహుల్ గాంధీ సభకు ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Jagga reddy: మంత్రి పువ్వాడ అజయ్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి

ప్రజా వ్యతిరేక పాలన పై సభలో రాహుల్ ప్రస్తావిస్తారని, 5లక్షల మందితో సభను విజయవంతం చేస్తామని జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తేవడంలో రాష్ట్ర ప్రజలు ముందుండాలని జగ్గారెడ్డి కోరారు. లా అండ్ ఆర్డర్ కాపాడడంలో పోలీసులు, ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగ్గారెడ్డి విమర్శించారు. రామాయంపేట ఘటన నిందితులకు పోలీసులు, ప్రభుత్వ అండదండలు ఉన్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు. ఎన్నికల పొత్తులపై ఏఐసీసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని జగ్గారెడ్డి తెలిపారు.