Welfare Hostels 581 Vacants : నిరుద్యోగులకు టీసర్కార్ మరో గుడ్ న్యూస్.. వెల్ఫేర్ హాస్టళ్లలో 581 ఉద్యోగాలకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో మరో 581 ఉద్యోగ పోస్టులను భర్తీ చేయనుంది. గురువారం 185 వెటర్నరీ సర్జన్, 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టీఎస్ పీఎస్సీ.. శుక్రవారం సంక్షేమ హాస్టళ్లలో 581 ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

Welfare Hostels 581 Vacants : నిరుద్యోగులకు టీసర్కార్ మరో గుడ్ న్యూస్.. వెల్ఫేర్ హాస్టళ్లలో 581 ఉద్యోగాలకు నోటిఫికేషన్

TSPSC

Welfare Hostels 581 Vacants : తెలంగాణలో కొలువుల జాతర నెలకొంది. టీఎస్ పీఎస్సీ ఉద్యోగాల నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి వరుస నోటిఫికేషన్లు కొనసాగుతున్నాయి.  నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో మరో 581 ఉద్యోగ పోస్టులను భర్తీ చేయనుంది. గురువారం 185 వెటర్నరీ సర్జన్, 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టీఎస్ పీఎస్సీ.. శుక్రవారం సంక్షేమ హాస్టళ్లలో 581 ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

వీటిలో అత్యధికంగా 549 హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వార్డెన్ 8, మ్యాట్రన్ 5, లేడీ సూపరింటెండెంట్ పోస్టులు 19 ఉన్నాయి. వీటితోపాటు బీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2లో మొత్తం 140 ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో ప్రీ మెట్రిక్ బాయ్స్ హాస్టల్ లో 87, పోస్టు మెట్రిక్ బాయ్స్ హాస్టల్ లో 14, ప్రీ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ లో 26, పోస్టు మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ లో 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

TSPSC Notification 207 Jobs : నిరుద్యోగులకు టీసర్కార్ గుడ్ న్యూస్.. మరో 207 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఈ ఉద్యోగాలకు జనవరి 6 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్ పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ పేర్కొన్నారు. ఆన్ లైన్ దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in వెబ్ సైట్ లో సంప్రదించాలని సూచించారు.

ఏ క్యాటగిరీ.. ఎన్ని ఉద్యోగాలు..
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1 (ట్రైబల్ వెల్పేర్) 5, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 (ట్రైబల్ వెల్ఫేర్) 106, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 ఫీమేల్ (ఎస్సీ డెవలప్ మెంట్) 70, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 మేల్ (ఎస్సీ డెవలప్ మెంట్) 228, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 (బీసీ వెల్ఫేర్) 140, వార్డెన్ గ్రేడ్-1 (డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ) 5, మ్యాట్రన్ గ్రేడ్-1 (డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్) 3, వార్డెన్ గ్రేడ్-2 (డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ) 3, మ్యాట్రన్ గ్రేడ్-2 (డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్) 2, లేడీ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోమ్ (ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్ మెంట్) 19 ఉద్యోగాలు ఉన్నాయి.