తెలంగాణలో 50 వేలు దాటిన కరోనా కేసులు…447 మంది మృతి

  • Published By: bheemraj ,Published On : July 23, 2020 / 11:48 PM IST
తెలంగాణలో 50 వేలు దాటిన కరోనా కేసులు…447 మంది మృతి

Updated On : July 24, 2020 / 6:30 AM IST

తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50 వేల దాటాయి. రాష్ట్రంలో కొత్తగా 1,567 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50, 826కు చేరాయి. వైరస్ సోకి 9 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 447కు పెరిగింది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని మరో 1,661 మంది డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రంలో 11,052 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 39,327 మంది డిశ్చార్జ్ అయ్యారు. జూన్, జులై నెలల్లో దాదాపుగా 45 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఎక్కువ కేసులు జీహెచ్ఎంసీలో నమోదవుతున్నాయి. ఇవాళ 9 కరోనాతో మృతి చెందారు.

జీహెచ్ఎంసీ 662, రంగారెడ్డి 213, వరంగల్ అర్బన్ 75, రాజన్నసిరిసిల్ల 62, మహబూబ్ నగర్ 61, నాగర్ కర్నూలు 51, నల్గొండ 44, సూర్యాపేట్ 39, కరీంనగర్ 38, నిజామాబాద్ 38 కరోనా కేసులు మేడ్చల్ 33, సంగారెడ్డి 32, మెదక్ 27, భూపాలపల్లి 25, వరంగల్ రూరల్ 22, జనగామ జిల్లాల్లో 22 కేసుల చొప్పున నమోదు అయ్యాయి.

మహబూబాబాద్ 18, కామారెడ్డి 17, ములుగు 17, ఆదిలాబాద్ 17, జగిత్యాల 14, ఖమ్మం 10, సిద్దిపేట్ 9, వికారాబాద్ 5, యాదాద్రి భువనగిరి 4, ఆసిఫాబాద్ 4, పెద్దపల్లి 2, భద్రాద్రి 2, గద్వాల్ 2, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు నమోదు అయింది.