GVL Narasimha Rao : అమరావతే రాజధాని.. కేంద్రం కూడా ఒప్పుకుంది-జీవీఎల్
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగాలని.. కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగానే గుర్తించిందని, అమరావతి రాజధానిగా కేంద్రం కూడా ఒప్పుకుందని ఆయన అన్నారు.

Ap Capital Amaravathi
GVL Narasimha Rao : రాజధాని అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీకి మూడు రాజధానులు అని రాష్ట్ర ప్రభుత్వం అంటుంటే, అమరావతే ఒక్కటే రాజధాని అని విపక్షాలు అంటున్నాయి. దీనిపై వివిధ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని, అందులో ఎలాంటి మార్పు లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తేల్చి చెప్పారు. తాజాగా బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Balakrishna : ‘అన్ స్టాపబుల్’ బాలయ్యతో మాస్ మహారాజ్
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగాలని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గానే గుర్తించిందని, అమరావతి రాజధానిగా కేంద్రం కూడా ఒప్పుకుందని ఆయన అన్నారు. రాయలసీమలోనే హైకోర్టు పెట్టండని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే తాము చెప్పామని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో హైకోర్టు విషయం ఇప్పుడే తేలేలా లేదని ఆయన అన్నారు. అనంతపురం జిల్లాలో బీజేపీ శిక్షణ తరగతులలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు.
Best Foods : రన్నింగ్, జాగింగ్ చేసే వారికి బెస్ట్ ఫుడ్స్ ఇవే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ మంది సీఎంలు రాయలసీమ నుంచే వచ్చారని… అయినప్పటికీ రాయలసీమ అభివృద్ధి చెందలేదని జీవీఎల్ అన్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా పూర్తిగా వెనుకబడి ఉందన్నారు. రాయలసీమ అభివృద్ధికి బీజేపీ ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోందని చెప్పారు. అందుబాటులో ఉన్న అవకాశాలను ఏపీ ప్రభుత్వం వాడుకోవడం లేదని విమర్శించారు.