AP Covid Update : ఏపీలో కొత్తగా 3 కోవిడ్ కేసులు నమోదు

దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్  ఎక్స్ఈ  కేసు ముంబైలో నమోదు అవటం కలకలం రేపుతుంటే మరోవైపు ఏపీలో కోవిడ్ కేసులు దాదాపు తగ్గుముఖం పట్టాయి. 

AP Covid Update : ఏపీలో కొత్తగా 3 కోవిడ్ కేసులు నమోదు

Ap Covid Up Date

Updated On : April 6, 2022 / 6:04 PM IST

AP Covid Update :  దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్  ఎక్స్ఈ  కేసు ముంబైలో నమోదు అవటం కలకలం రేపుతుంటే మరోవైపు ఏపీలో కోవిడ్ కేసులు దాదాపు తగ్గుముఖం పట్టాయి.  నిన్నరాష్ట్రంలో 3 కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది.

రాష్ట్రంలోని పాత 13 జిల్లాలలో అనంతపురం, చిత్తూరు, శ్రీకాకుళం జిలాలలో నిన్న ఒక్కోక్క కోవిడ్ కేసు చొప్పున నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య23,19,586 కి చేరింది.

నిన్న కోవిడ్ నుంచి 20మంది కోలుకున్నారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 23,04, 786కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 70 యాక్టివ్ కేసులు ఉన్నాయి.రాష్ట్రంలో ఇంతవరకు 3,34,62,024 శాంపిల్స్ ను పరీక్షించారు.

Also Read : Omicron New Variant XE : ముంబైలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ XE తొలి కేసు నమోదు