Manipur Telugu People : మణిపూర్ లో బిక్కుబిక్కుమంటున్న తెలుగు ప్రజలు.. తీసుకొచ్చేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు
ఆందోళనలతో మణిపూర్ అడ్డుకుడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లను బాధితులు, వారి తల్లిదండ్రులు సంప్రదిస్తున్నారు.

Manipur Telugu People
Manipur Telugu People : మణిపూర్ లో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. అక్కడున్న తెలుగు ప్రజలను తరలించేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. తెలంగాణ పౌరులు, విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ ప్రారంభించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. విమానం ఆదివారం మణిపూర్ రాజధాని ఇంపాల్ కు చేరుకోనుంది.
అక్కడి నుంచి తెలంగాణ బిడ్డలను తరలించే ఏర్పాట్లను సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక హెల్ప్ లైన్ దగ్గర నుంచి బాధితులకు మంచి నీరు, భోజనం, వసతి ఏర్పాట్లు చేయనున్నారు. ఇప్పటికే మణిపూర్ సీఎస్ తో తెలంగాణ సీఎస్ మాట్లాడారు. విద్యార్థులు, పౌరులు సురక్షితంగా తరలించే విషయంపై చర్చించారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఆదేశాలతో మణిపూర్ లో చిక్కుకున్న తెలంగాణ పౌరులు, విద్యార్థుల కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్ లైన్ ను తెచ్చారు.
Manipur violence: కనిపిస్తే కాల్చేయండి.. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో కఠిన ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం
ఈ హెల్ప్ లైన్ కు డీఐజీ సుమతిని ఇంచార్జీగా నియమించారు. ఆమె బాధితులకు ధైర్యం చెబుతూ ఉన్నత అధికారులకు ఎప్పటికప్పుడూ తాజా సమాచారం అందిస్తున్నారు. ఆందోళనలతో మణిపూర్ అడ్డుకుడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లను బాధితులు, వారి తల్లిదండ్రులు సంప్రదిస్తున్నారు. తెలంగాణకు చెందిన సుమారు 250 మంది ఇంపాల్, ఇతర ప్రాంతాల్లోని విద్యా సంస్థల్లో చదువుతున్నట్లు సమాచారం.
ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే తెలంగాణ పౌరులు కూడా మణిపూర్ లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మణిపూర్ పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నట్లు డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. కొందరు తెలుగు విద్యార్థులు హాస్టల్స్ లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఒక్క ఇంపాల్ ఎన్ ఐటీలోనే సుమారు 150 మంది తెలుగు విద్యార్థులున్నట్లు సమాచారం.
Manipur Violence : మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్లు
వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారు తిండి, తాగు నీరు లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి పోలీసులు 144 సెక్షన్ విధించి అడుగడుగునా జామర్లు పెట్టడంతో ఫోన్ సిగ్నల్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. అల్లర్లు జరిగిన ప్రాంతంలో ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు. వచ్చే ఐదు రోజులపాటు ఫోన్స్, ఇంటర్నెట్ పై ఈ నిషేధం కొనసాగుతోంది.
అటు ఏపీ ప్రభుత్వం కూడా ఆంధ్ర విద్యార్థుల తరలింపు కోసం చర్యలు చేపట్టింది. మణిపూర్ లో చిక్కుకున్న విద్యార్థులను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించారు. ప్రత్యేక అధికారిగా మైఖేల్ ను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఏపీ భవన్ లో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీ భవన్ అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. మణిపూర్ లోని వివిధ యూనివర్సిటీల్లో ఏపీకి చెందిన 150 మంది విద్యార్థులు చదువుతున్నట్టు అంచనా.
Manipur: నా రాష్ట్రం తగలబడిపోతోంది.. దయచేసి కాపాడండి; మేరీ కోమ్ అభ్యర్థన
గిరిజన తెగల మధ్య ఘర్షణతో విద్యార్థులు భయాందోళనకు లోనయ్యారు. మణిపూర్ లో శాంతి భద్రతల పునరుద్ధరణకు అక్కడి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్ధితిపై చర్చించారు. శాంతి, సుస్థిరతల స్థాపనకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో సీపీఐ, నాగ పీపుల్స్ ఫ్రంట్, టీఎస్ పీ, ఆప్ తదితర పార్టీలు పాల్గొన్నాయి.