CM YS Jagan : సోమవారం ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్  రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది.

CM YS Jagan : సోమవారం ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్

Cm Ys Jagan

Updated On : June 5, 2021 / 5:07 PM IST

CM YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్  రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. అమిత్ షాతో పాటు ఆయన పలువురు కేంద్రమంత్రులను కలిసి పోలవరం ప్రాజెక్ట్‌తోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. విభజన హామీలు, వ్యాక్సినేషన్‌పై కూడా సీఎం  జగన్ సంబంధిత శాఖల మంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరో వైపు వ్యాక్సిన్ విషయంలో సీఎం  జగన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాయటం…ఆయన ఢిల్లీ టూర్  ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏపీలో వ్యాక్సినేషన్   ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ  తీవ్ర కొరత  ఏర్పడింది.  దీంతో ఆయన వ్యాక్సిన్ విషయంలో రాష్ట్రాలుగా మనం ఏమీచేయలేం.  చాలా సవాళ్లు ఉన్నాయి.  ఈవిషయాన్ని  కేంద్రానికి  వదిలేద్దాం అని లేఖలో పేర్కోన్నారు. దేశంలోని  పలు రాష్ట్రాల సీఎం లకు ఆయన లేఖలు రాసినప్పటికీ  కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు రాసిన లేఖ బహిర్గతమయ్యింది.