Nayi Brahmins: నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం శుభవార్త.. జీతాలు పెంపు
సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది దేవాదాయశాఖ.

Nayi Brahmins: దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులకు మేలు కలిగేలా కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. జీతాలు పెంచింది. నాయీ బ్రాహ్మణులకు ఇచ్చే నెలవారీ భృతిని 25 వేలకు పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది దేవాదాయశాఖ. 44, 6ఏ కేటగిరీ దేవాలయాల్లో కేశఖండన చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు ఈ పెంపు వర్తించేలా జీవో జారీ చేసింది.
నెలవారీ భృతిని 20 వేల నుంచి 25 వేలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది దేవాదాయ శాఖ. కనీస మొత్తంగా 25 వేల భృతిని నాయీ బ్రాహ్మణులకు అందేలా నిర్ణయం తీసుకుంది. ఇటీవల నిర్వహించిన సమీక్షలో నాయీ బ్రాహ్మణులకు భృతిని పెంచాల్సిందిగా ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది దేవాదాయశాఖ.
Also Read: రేపే ఆకాశంలో స్మైలీ మూన్.. చూడొచ్చా, లేదా? చూస్తే మంచిదా, కాదా? జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారు..