AP Corona Cases : ఏపీలో కొత్తగా 1,345 కరోనా కేసులు.. 4 మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 1,345 కోవిడ్ కేసులు వచ్చాయి. మరో నలుగురు కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6వేల 576 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

AP Corona Cases : ఏపీలో కొత్తగా 1,345 కరోనా కేసులు.. 4 మరణాలు

Ap Corona Cases

Updated On : February 10, 2022 / 5:59 PM IST

AP Corona Cases : ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కోవిడ్ కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో కొత్తగా 1,345 కోవిడ్ కేసులు వచ్చాయి. మరో నలుగురు కరోనాతో చనిపోయారు. చిత్తూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6వేల 576 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

Weight : బరువు సులభంగా తగ్గాలంటే?

రాష్ట్రంలో ప్రస్తుతం 40వేల 888 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్రంలో 26వేల 393 కరోనా టెస్టులు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14,683కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,27,59,439 కరోనా టెస్టులు చేశారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,09,967. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,54,400. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

Tata Nexon EV: వావ్! ఈ SUVకారులో రూ. 580కే 1000కి.మీలు ప్రయాణించొచ్చు

తాజాగా నమోదైన కేసుల్లో రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 309 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 16 కేసులు వచ్చాయి. బుధవారంతో (1,679) పోలిస్తే గురువారం కొత్త కేసుల సంఖ్య మరింత తగ్గింది.

దేశంలో తీవ్ర ఆందోళన రేకెత్తించిన కరోనా థర్డ్ వేవ్ ముప్పు క్రమంగా తొలగిపోతోంది. కోవిడ్ తీవ్రత తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. దేశంలో కొత్తగా 67,084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,78,060కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,241 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5,06,520కి పెరిగింది.

అదే సమయంలో 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 1,67,882 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,11,80,751కి చేరింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,71,28,19,947 మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో 46,44,382 మందికి వ్యాక్సిన్లు వేశారు. దేశంలో కోవిడ్ యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 7,90,789గా ఉంది.

కాగా, మార్చి నెల ప్రారంభంలో కరోనా మహమ్మారి ఎండమిక్‌గా మారనుందని ఐసీఎంఆర్‌ వైద్య నిపుణుడు సమీరన్ పాండా అంచనా వేశారు. అదే సమయంలో కొవిడ్‌ నిబంధనల విషయంలో అశ్రద్ధ వహించకుండా ఉండాలని సూచించారు. కొత్త వేరియంట్లు పుట్టుకురాకపోతే.. మార్చి 11 కల్లా కరోనా వైరస్ ఎండమిక్‌గా మారనుందని పాండా అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 11తో ప్రారంభమైన ఒమిక్రాన్ వేవ్ ప్రభావం మూడు నెలల పాటు ఉంటుందని అంచనా వేశారు. మార్చి 11 నుంచి మనకు కొంత రిలీఫ్ లభించొచ్చని తెలిపారు.