AP Corona Cases : ఏపీకి బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కరోనా కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,597 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 8మంది కోవిడ్ తో మరణించారు.

AP Corona Cases : ఏపీకి బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కరోనా కేసులు

Ap Corona Cases

Updated On : February 7, 2022 / 6:29 PM IST

AP Corona Cases : ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,597 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 8మంది కోవిడ్ తో మరణించారు. విశాఖపట్నంలో ఇద్దరు.. చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో చనిపోయారు.

అదే సమయంలో ఒక్కరోజే 8వేల 766 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 62వేల 395 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 18వేల 601 కోవిడ్ పరీక్షలు చేశారు. నేటి వరకు రాష్ట్రంలో 3,26,79,288 కరోనా టెస్టులు చేశారు. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14,672కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,05,052. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 22,27,985.

గడిచిన 24 గంటల్లో నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 478 కరోనా కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 15 కేసులు వెలుగుచూశాయి.

థ‌ర్డ్ వేవ్ రూపంలో భార‌త్‌పై కరోనా మహమ్మారి (ఒమిక్రాన్ వేరియంట్) విరుచుకుప‌డింది. కొన్ని రోజుల క్రితం భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, ఇప్పుడు మ‌ళ్లీ కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా త‌గ్గుతున్నాయి. గడిచిన 24 గంట్లలో దేశంలో కోవిడ్ కేసులు భారీగా తగ్గాయి. లక్ష దిగువకు వచ్చాయి.

కేంద్ర ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంటల్లో దేశ‌వ్యాప్తంగా 83వేల 876 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. ఒకేరోజు 11,56,363 కరోనా టెస్టులు చేశారు. మ‌రో 895 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు. ఇదే స‌మ‌యంలో 1,99,054 మంది కోవిడ్ బాధితులు పూర్తి స్థాయిలో కోలుకున్న‌ారు.

కాగా, థ‌ర్డ్ వేవ్ విజృంభ‌ణ మొద‌లైన త‌ర్వాత‌ జనవరి 6వ తేదీ నుంచి లక్ష మార్క్‌కు దిగువ‌గా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక‌, దేశ‌వ్యాప్తంగా ప్రస్తుతం 11,08,938 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కోవిడ్ తో మృతి చెందిన‌ వారి సంఖ్య 5,02,874కు చేరింది. రికవరీల కేసుల సంఖ్య 4,06,60,202కు పెర‌గ‌గా.. భారత్‌లో ఇప్పటివ‌ర‌కు 1,69,63,80,755 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు.