Bachina Krishna Chaitanya: చాలా బాధగా ఉందంటూ.. వైసీపీ నేత బాచిన కృష్ణ చైతన్య కామెంట్స్
అప్పటినుండి ఇప్పటివరకు తాను ఏపార్టీ నేతలతోనూ సంప్రదింపులు జరపలేదని తెలిపారు. అయితే, సర్వే చేస్తామని చెప్పి నెలరోజులవుతోందని, అధిష్ఠానం ఇంతవరకు తనను పిలిపించలేదని కృష్ణ చైతన్య అసంతృప్తి వ్యక్తం చేశారు.

Bachina Krishna Chaitanya
Bachina Krishna Chaitanya YSRCP: ఆంధ్రప్రదేశ్‌లోని అద్దంకి వైసీపీ మాజీ ఇన్‌చార్జ్, రాష్ట్ర శాప్ కార్పొరేషన్ ఛైర్మన్ బాచిన కృష్ణ చైతన్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ లైన్ ఎక్కడా దాటలేదని చెప్పారు. వైసీపీ సర్వే చేయించే వరకు అద్దంకిలో ఎలాంటి వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించవద్దని సీఎం జగన్ తనకు చెప్పారన్నారు.
అప్పటినుండి ఇప్పటివరకు తాను ఏపార్టీ నేతలతోనూ సంప్రదింపులు జరపలేదని తెలిపారు. అయితే, సర్వే చేస్తామని చెప్పి నెలరోజులవుతోందని, అధిష్ఠానం ఇంతవరకు తనను పిలిపించలేదని కృష్ణ చైతన్య అసంతృప్తి వ్యక్తం చేశారు. 2019లో తాను వైసీపీ బాధ్యతలు తీసుకుని పోటీ చేసి ఓడినప్పటికీ ఇప్పటికీ పార్టీలోనే ఉన్నానని చెప్పారు.
ఎన్నికల సమయంలో తనను బాధ్యతల నుంచి తొలగించడం చాలా బాధగా ఉందని తెలిపారు. ఈ పరిణామాల మధ్యే నిన్న తన గ్రానైట్ క్వారీలపై దాడులు జరిగాయని అన్నారు. దీంతో తాను బాలినేనిని కలవడానికి వచ్చానని తెలిపారు.
సీఎం జగన్ తనపై మంచి అభిప్రాయంలో ఉన్నప్పటికీ.. వైసీపీ అధిష్ఠానంలోని కొన్ని శక్తులు తనకు వ్యతిరేకంగా పనిచేశాయని అన్నారు. కాగా, నిన్న బల్లికురవ మండలం మల్లాయపాలెంలోని కృష్ణ చైతన్యకు చెందిన ఆర్ణ స్టోన్స్ గ్రానైట్ క్వారీపై మైనింగ్ అధికారులు సోదాలు జరపడం, ఈ నేపథ్యంలో బాలినేనితో ఆయన భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.
Also Read: సీఎం అయ్యాక జగనన్న మారిపోయాడు.. అందరినీ దూరం చేసుకున్నాడు: వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు