Bees Attack : తేనెటీగల దాడి.. తప్పించుకున్న ఏపీ మంత్రి, ఆరుగురి పరిస్థితి విషమం

Bees Attack : తీవ్రంగా గాయపడిన పంచాయతీ కార్యదర్శి స్వామి నాయక్‌ను కర్నూలుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

Bees Attack : తేనెటీగల దాడి.. తప్పించుకున్న ఏపీ మంత్రి, ఆరుగురి పరిస్థితి విషమం

Buggana Rajendranath (Photo : Google)

Updated On : June 28, 2023 / 6:32 PM IST

Buggana Rajendranath – Bees Attack : నంద్యాల జిల్లాలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బృందంపై తేనెటీగల దాడి జరిగింది. బేతంచెర్ల మండలంలోని బిల్వసాగరం గుహల సందర్శనకు వెళ్లిన బుగ్గన బృందంపై తేనేటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడి నుంచి మంత్రి బుగ్గన తప్పించుకున్నారు. ఈ ఘటనలో 20మందికి గాయాలయ్యాయి.

గాయపడ్డ వారిలో ఐదుగురిని బేతంచెర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన పంచాయతీ కార్యదర్శి స్వామి నాయక్‌ను కర్నూలుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. తేనెటీగల దాడిలో గాయపడ్డవారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Also Read..Adala Prabhakar Reddy : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

బుధవారం నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలో గుహల సందర్శనకు మంత్రి బుగ్గన రాజేంద్ర బృందం వెళ్లింది. ఈ గుహలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు మంత్రి చొరవ తీసుకున్నారు. ఇప్పటికే జరుగుతున్న పనులను ఆగస్టు కల్లా పూర్తి చేయాలని మంత్రి బుగ్గన అధికారులను ఆదేశించారు. పనుల పరిశీలనకు వెళ్లిన ఆర్థిక మంత్రి సహా అధికారులు, ప్రజా ప్రతినిధుల బృందానికి ఊహించిన అనుభవం ఎదురైంది. గుహల్లో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా వారిపై దాడి చేశాయి.

Also Merugu Nagarjuna: మీ పాలనలోనే ఇవన్నీ జరిగాయి: టీడీపీకి మంత్రి మేరుగు నాగార్జున కౌంటర్

వెంటనే అలర్ట్ అయిన గన్ మెన్లు, పోలీసులు… మంత్రి బుగ్గనను తేనెటీగలు కుట్టకుండా చుట్టుముట్టి నియంత్రించగలిగారు. కాగా, తేనెటీగల దాడిలో పలువురికి గాయాలయ్యాయి.