ఇలాంటివి ఉండకూడదని పవన్ అన్న కూడా చెబుతున్నారు: నారా లోకేశ్
కూటమిలో విభేదాలు ఉన్నా చంద్రబాబు-పవన్ అలానే సరిచేస్తారు.
Nara Lokesh (Image Credit To Original Source)
- కూటమిలో విడాకులు, మిస్ ఫైర్‌లు ఉండకూడదు
- విభేదాలు ఉంటే సరిదిద్దే బాధ్యత అధినాయకత్వానిది
- విభేదాలు ఉంటే చంద్రబాబు-పవన్ సరిచేస్తారు
Nara Lokesh: కార్యకర్తలు అలిగితే నష్టపోయేది రాష్ట్ర ప్రజలని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ లోకేశ్ పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు.
“కార్యకర్తల అలక కరోనా కంటే ప్రమాదకరమైన జబ్బు. ప్రతిపక్షంలో ఎన్ని అరాచకాలు ఎదుర్కొన్నామో అంతా గ్రహించాలి. పార్టీ లోపల సమస్యలపై పోరాడదాం, బయట జై టీడీపీ అని ఐక్యంగా నినదిద్దాం.
Also Read: రూ.2 లక్షల మార్కును దాటడానికి సిద్ధమవుతున్న తులం బంగారం ధర.. ఎందుకింతగా పెరుగుతోందంటే?
కూటమిలో విడాకులు, మిస్ ఫైర్‌లు ఉండకూడదని పవన్ కల్యాణ్ అన్న కూడా చెబుతున్నారు. చిన్న విభేదాలు ఉన్నా సరిదిద్దే బాధ్యతను అధినాయకత్వం తీసుకుంటుంది. మా కుటుంబంలో ఉండే ఐదుగురు సభ్యుల్లో చిన్న చిన్న విభేదాలు ఉన్నా కుటుంబ పెద్దగా చంద్రబాబు అన్నీ చక్కదిద్దుతారు. కూటమిలో విభేదాలు ఉన్నా చంద్రబాబు-పవన్ అలానే సరిచేస్తారు.
పార్టీ సొంతిల్లు, ప్రభుత్వం అద్దె ఇల్లు అని మంత్రులంతా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని పనులున్నా చంద్రబాబు వారానికి ఒకరోజు పార్టీ కార్యాలయానికి సమయం కేటాయిస్తున్నారు. మంత్రులు కూడా వారానికోరోజు పార్టీ కార్యాలయానికి రావాలి” అని లోకేశ్ దిశానిర్దేశం చేశారు.
