CM Chandrababu Naidu: సంక్రాంతి పండుగ వేళ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి పండగే..
CM Chandrababu Naidu: సంక్రాంతి పండుగవేళ వివిధ వర్గాల వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి చెల్లించాల్సిన నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం..

CM Chandrababu Naidu
CM Chandrababu Naidu: ఏపీలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. నగరాల నుంచి ప్రజలు పల్లెలకు చేరుకున్నారు. గ్రామాగ్రామా సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో సంక్రాంతి పండుగవేళ వివిధ వర్గాల వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి చెల్లించాల్సిన నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్రభుత్వం తాజా నిర్ణయం వల్ల రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, చిన్న కాంట్రాక్టర్లు, పోలీస్ సిబ్బందికి మేలు జరగనుంది. వీరికి మొత్తం రూ.6,700 కోట్ల బకాయిలను విడుదల చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
Also Read: Chandrababu Naidu: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై బాబు మార్క్ డెసిషన్స్..!
నిధులు విడుదల ఇలా..
ఉద్యోగులకు జీపీఎఫ్ కింద రూ.519 కోట్లు.
పోలీసులకు సెరెండర్ లీవ్ బకాయిల్లో ఒక ఇన్స్టాల్ మెంట్ కింద రూ. 214 కోట్లు.
టీడీఎస్ కింద రూ..265 కోట్లు.
సీపీఎస్ కు సంబంధించిన రూ. 300 కోట్లు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.788 కోట్లు.
26వేల మంది చిన్న కాంట్రాక్టర్లకు (రూ.10 లక్షల లోపు బిల్లులు) రూ. 586 కోట్లు.
అమరావతి రైతుల కౌలు బకాయిలు రూ. 241 కోట్లు.
చిరు వ్యాపారులకు (ఆరువేల మందికి లబ్ధిచేకూరేలా) రూ. 100 కోట్లు.
ఎన్టీఆర్ వైద్య సేవకు రూ. 500 కోట్లు.
విద్యుత్ శాఖకు రూ. 500 కోట్లు.
ఇదిలాఉంటే.. నిధుల విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా ప్రస్తావించారు. సంక్రాంతి పండుగ సమయంలో రాష్ట్రంలో వివిధ వర్గాలకు మేలు చేసేలా ఆర్థికపరమైన నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నిధుల విడుదలకు తీసుకున్న ఈ నిర్ణయం లక్షల మంది ఇళ్లల్లో సంతోషాన్ని తెస్తుంది. పండుగ పూట వారి ఆనందం మాకు అత్యంత సంతృప్తినిస్తుందని అన్నారు.
చంద్రబాబు ట్వీట్ ప్రకారం.. ‘‘సంక్రాంతి పండుగ సమయంలో రాష్ట్రంలో వివిధ వర్గాలకు మేలు చేసేలా నేడు ఆర్ధికపరమైన నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, చిన్న కాంట్రాక్టర్లు, పోలీసు సిబ్బందికి బకాయిలు చెల్లించేందుకు రూ. 6,700 కోట్లు విడుదల చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు, అనేక సవాళ్లు ఉన్నా కూడా వారికి మేలు చేయాలనేదే ఈ ప్రయత్నం. నిధుల విడుదలకు తీసుకున్న ఈ నిర్ణయం లక్షల మంది ఇళ్లల్లో సంతోషాన్ని తెస్తుంది. పండుగ పూట వారి ఆనందం మాకు అత్యంత సంతృప్తినిస్తుంది. ప్రతి వర్గానికి మేలు చేసేలా నిరంతరం శ్రమిస్తామని, ప్రజల సంతోషం కోసం ప్రతిక్షణం పనిచేస్తామని తెలుపుతూ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు’’. అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.