Corona virus: విశాఖ ప్రజలను కలవరపెడుతున్న కరోనా.. పెరుగుతున్న కొవిడ్ కేసులు
దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్-1 వేగంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో జేఎన్-1 ప్రభావం ప్రస్తుతానికి లేకపోయినా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి.

Corona virus
Corona virus Visakhapatnam: దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్-1 వేగంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో జేఎన్-1 ప్రభావం ప్రస్తుతానికి లేకపోయినా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. విశాఖ ప్రజలను కోవిడ్ కలవరానికి గురిచేస్తోంది. ఇక్కడ ఏకంగా కొవిడ్ కేసుల సంఖ్య 7కు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా 24 మందికి కొవిడ్ పరీక్షలను అధికారులు నిర్వహించారు. మధురానగర్, అరిలోవ, ఎంవీపీ కాలనీ ప్రాంతాలకు చెందిన వారికి కోవిడ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
కోవిడ్ సోకిన వారిలో ఆరుగురు హోం ఐసోలేషన్ లో ఉండగా.. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీఒక్కరూ మాస్క్ లు ధరించి, వీలైనంత వరకూ రద్దీ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలాఉంటే.. కోవిడ్ వ్యాప్తిపై ఇప్పటికే సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. కొత్త వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కొత్త వేరియంట్ వల్ల ఆందోళన అనవసరమని వైద్యులు చెబుతున్నారు.. ముందస్తు చర్యల పట్ల దృపెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సీఎం జగన్ సూచించారు.