ఇంట్రెస్టింగ్ : ఈ భారీ వర్షాలకు కరోనాయే కారణమట..

  • Published By: nagamani ,Published On : October 20, 2020 / 01:31 PM IST
ఇంట్రెస్టింగ్ : ఈ భారీ వర్షాలకు కరోనాయే కారణమట..

Updated On : October 31, 2020 / 4:13 PM IST

corona is also a reason for heavy rains వర్షాకాలం వెళ్లిపోయినా ఇంకా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతునే ఉన్నాయి. గ్రామాలనేకాదు నగరాల్ని కూడా వర్షాలు ముంచెత్తున్నాయి. హైదరాబాద్ లో ఎడతెరిపిలేని వానతో రోడ్డు ఇళ్లు తేడా తెలీకుండా వరదనీరు ముంచెత్తుతోంది. అక్టోబర్ నెల వచ్చిందంటే..వర్షాకాలం వెళ్లినట్లే శీతాకాలం వచ్చినట్లే.




కానీ ఈ సంవత్సరంలో అక్టోబర్ 20 తేదీ వచ్చినా వర్షాలు మాత్రం కురుస్తునే ఉన్నాయి. మబ్బు పట్టిందంటే చాలు ఎక్కడ వర్షం వచ్చి ముంచెత్తుతుందోనని ప్రజలు హడలిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అక్టోబర్ నెలలో కూడా ఇంత భారీ వర్షాలేంటన్న ప్రశ్న అటు వాతావరణ కేంద్రాలతో పాటు శాస్త్రవేత్తలకు చూడా వచ్చింది. దీంతో శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనాలు చేయగా..ఓ అంచనాకు వచ్చారు. ‘‘కరోనా’’మహమ్మారే ఈ వర్షాలకు కారణమని అభిప్రాయపడుతున్నారు. కరోనాకు భారీ వర్షాలకు సంబంధమేంటీ అనే డౌట్ వచ్చేఉంటుంది కదూ..
https://10tv.in/heavy-rains-another-two-days/


వర్షాకాలానికి ముందు వేసవికాలమంతా అంటే ఎండలు మండే మార్చి మూడవ వారం నుంచి జూలై వరకూ దేశవ్యాప్తంగా సంపూర్ణంగా లాక్ డౌన్ అమలైంది. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. అన్ని రకాల పరిశ్రమలు మూతపడ్డాయి. జనాలు తిరగటం తక్కువై వాహనాల రాకపోకలు కూడా పెద్దగా లేవు. దీంతో కాలుష్యం భారీగా తగ్గిపోయింది. ఫలితంగా గాలిలో స్వచ్ఛత ఏర్పడి..తేమ శాతం పెరిగింది. దీంతో వర్షాలు భారీగా కురుస్తున్నాయనీ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.


వాతావరణంలో ఊహించని మార్పులు భారీ వర్షాలకు కారణమైందనీ..దీనికితోడు వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు ఏర్పడటం..నైరుతీ రుతుపవనాలు వెనక్కు మళ్లడం ఆలస్యమైందని..సరిగ్గా అదే సమయంలో పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ఎల్ నినో ప్రభావం భారత ఉపఖండంపై ఏ మాత్రమూ కనిపించలేదని వెల్లడించారు. ఈ కారణంతోనే వర్షాలు అధికంగా కురుస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.


కాగా..గత 11 సంవత్సరాల్లో నైరుతీ రుతుపవనాలు 2018లో బాగా ఆలస్యంగా సెప్టెంబర్ 29న నిష్క్రమణను ప్రారంభించాయని..ఈ 2020 సెప్టెంబర్ 28న నైరుతీ రుతుపవనాలు వెనక్కు మళ్లాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాస్తవానికి ఆ రోజుతో వర్షాకాలం ముగింపు మొదలైనట్టే.


ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా వస్తున్న తేమగాలులు..మధ్యప్రదేశ్ పై ఉన్న రుతుపవనాలకు అడ్డుగా నిలిచి, వాటిని ఎటూ కదలకుండా ఆపివేశాయి.ఈక్రమంలో కురుస్తున్న వర్షాలతోతెలంగాణ అతలాకుతం అయిపోతోంది. పంటలు నాశనమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలతో పాటు ఎగువనున్న ప్రాంతాలు సైతం ముంపుకు గురవుతున్నా పరిస్థితులు.


ప్రస్తుత పరిస్థితుల్లో నైరుతి పవనాలు తెలంగాణ నుంచి ఎప్పుడు వెళ్లిపోతాయో ఇప్పుడే చెప్పలేమని, బంగాళాఖాతంలో ప్రశాంతత ఏర్పడితేనే అవి పూర్తిగా వెనుదిరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.ఈ ప్రభావంతో మరో నాలుగైదు రోజుల పాటు రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందనీ..ఆ తరువాతే వర్షాలు తగ్గేందుకు అవకాశం ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు.