Nara Lokesh : టీడీపీ నేత నారా లోకేష్ పై క్రిమినల్ కేసు

టీడీపీ నేత నారా లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై ట్విట్టర్ లో నారా లోకేష్ ఆరోపణలు చేశారు.

Nara Lokesh : టీడీపీ నేత నారా లోకేష్ పై క్రిమినల్ కేసు

Nara Lokesh

Updated On : May 8, 2021 / 10:43 PM IST

Criminal case against Nara Lokesh : మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. అనంతపురంలోని డి.హీరేహల్ లో ఈ కేసు నమోదైంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై ట్విట్టర్ లో నారా లోకేష్ ఆరోపణలు చేశారు.

టీడీపీ కార్యకర్తపై కర్నాటకలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ నిందను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై వేస్తూ లోకేష్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. లోకేష్ పై వైసీపీ ఎస్టీ సెల్ నేత భోజరాజు నాయక్ ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించారని భోజరాజు నాయక్ ఆరోపించారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద నారా లోకేష్ పై కేసు నమోదు చేశారు.