YCP Leader: వైసీపీకి మరో బిగ్‌షాక్‌.. టీడీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని

ఏలూరు జిల్లా వైసీపీలో ఆళ్ల నాని కీలక నేతగా కొనసాగారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత కొద్దికాలంకే ఆ పార్టీకి, సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

YCP Leader: వైసీపీకి మరో బిగ్‌షాక్‌.. టీడీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని

Alla Nani

Updated On : December 3, 2024 / 11:25 AM IST

YCP Leader Alla Nani : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరనున్నారు. ఇవాళ సాయంత్రం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఆళ్ల నానితోపాటు పలువురు వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఏలూరు జిల్లా నేతలకు టీడీపీ హైకమాండ్ పిలుపునిచ్చింది.

Also Read: బాబు, పవన్ భేటీ.. రేషన్ రైస్‌ మాఫియాకు హడల్‌.. బియ్యం దందా వెనుక ఉన్న ఆ పెద్దల అంతు చూస్తారా?

ఏలూరు జిల్లా వైసీపీలో ఆళ్ల నాని కీలక నేతగా కొనసాగారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత కొద్దికాలంకే ఆ పార్టీకి, సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా చేసిన సమయంలో వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. అయితే, ఆళ్ల నాని ఓ ప్రణాళిక ప్రకారం ఆయన అనుచరులను ఒక్కొక్కరిగా వైసీపీ నుంచి టీడీపీ గూటికి చేర్చారు. వీరిలో ఏలూరు మేయర్, పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్ పర్సన్, ఏలూరు జిల్లాలోని వైసీపీ ముఖ్యనేతలు ఉన్నారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి వాళ్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా ఆళ్ల నానిసైతం చంద్రబాబు సమక్షంలో ఇవాళ టీడీపీలో చేరనున్నారు.

Also Read: Pawan Kalyan : సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక భేటీ.. ఏయే అంశాలపై చర్చిస్తున్నారంటే..

ఇవాళ ఉదయమే చంద్రబాబుతో ఆళ్ల నాని భేటీ జరగాల్సి ఉన్నప్పటికీ.. కేబినెట్ సమావేశం ఉండటం వల్ల సాయంత్రంకు వాయిదా పడింది. సాయంత్రం సీఎం చంద్రబాబుతో ఆళ్ల నాని భేటీ కానున్నారు. అయితే, ఇవాళే టీడీపీ కండువా కప్పుకుంటారా.. లేదా జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతారా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఆళ్ల నానితో మరికొందరు వైసీపీ నేతలు టీడీపీలో చేరతారని తెలుస్తోంది.