Godavari Floods: పోలవరం వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవాహం.. ధవళేశ్వరం వద్ద..
మహారాష్ట్ర, చత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. దాంతో గోదావరి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఎగువ నుంచి పోలవరం ప్రాజెక్టులోకి వచ్చే వరద గంట గంటకూ పెరుగుతోంది.

Godavari Flood At Polavaram
Godavari Floods: మహారాష్ట్ర, చత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. దాంతో గోదావరి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఎగువ నుంచి పోలవరం ప్రాజెక్టులోకి వచ్చే వరద గంట గంటకూ పెరుగుతోంది. దీంతో పోలవరం వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. ఉద్ధృతి పెరుగుతుండడంతో మంత్రి అంబటి రాంబాబు, ఇరిగేషన్ ఉన్నతాధికారులు రాత్రి పోలవరం లోనే బస చేశారు.
Dhavaleshwaram : గోదావరి వరద ఉధృతి..ధవళేశ్వరం బ్యారేజ్ పై రాకపోకలు నిలిపివేత
అప్పర్ స్పిల్ వే పై 37 మీటర్లు, లోయర్ స్పిల్ వే పై 28 మీటర్లు గా నీటిమట్టం నమోదైంది. దిగువకు 20 లక్షల పైగా క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. కాపర్ డ్యాం ను మరింత పటిష్ట పరిచే చర్యలను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే గతంలో ఉన్న ఎత్తుకంటే ఒక మీటరు అదనంగా ఇసుక బస్తాలు, కొండ రాళ్ళును ఉంచారు. కాపర్ డ్యాం పటిష్టత పై ఎప్పటికప్పుడు మంత్రి అంబటి రాంబాబు ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Godavari Floods: భయం గుప్పిట్లో భద్రాద్రి.. 71.30 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం..
మరోవైపు ధవళేశ్వరం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 23.20 లక్షల క్యూసెక్కులుగా ఉంది. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. 25 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆరు జిల్లాల్లోని 44 మండలాల్లో 628 గ్రామాలపై గోదావరి వరద ప్రవాహం ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే విపత్తుల సంస్థ సంబంధిత అధికారుల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.
Polavaram Villages : గోదావరి ఉధృతి..పోలవరం దగ్గర ముంపునకు గురైన పలు గ్రామాలు
అంబేద్కర్ కోనసీమలో 21, తూర్పుగోదావరిలో తొమ్మిది మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐదు, పశ్చిమ గోదావరి లో నాలుగు మండలాలపైన, ఏలూరులో మూడు, కాకినాడ జిల్లాలో రెండు మండలాలపైన వరద ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే ఆదేశాలను అధికారులు పాటిస్తూ ముంపు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
వరద ఉధృతి దృష్ట్యా అదనపు సహాయక బృందాలు రంగంలోకి దిగారు. సహాయక చర్యల్లో మొత్తం 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. ఇప్పటివరకు ఆరు జిల్లాల్లోని 42 మండలాల్లో 279 గ్రామాలు వరద ప్రభావితం కాగా, మరో 177 గ్రామల్లో వరద ప్రవాహంలో చిక్కుకొనే పరిస్థితి ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 62,337 మందిని 220 పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరితో పాటు వివిధ ప్రాజెక్టుల్లో కృష్ణా, తుంగభద్ర నదుల్లో వరద ప్రవాహం లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.