Tdp: జంబో టు మినీ..! టీడీపీ కార్యవర్గంలో మార్పులు ఎందుకు? అధిష్టానం లెక్కలేంటి?
ఓవైపు సీనియర్లు..ఇంకోవైపు క్యాస్ట్ ఈక్వేషన్స్, మరోవైపు పార్టీ కోసం కష్టపడ్డోళ్లు, గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన నేతలు..ఇలా అందరికి పదవులు అకామిడేట్ చేయడం కోసం తీవ్ర కసరత్తే చేస్తున్నారట.
- జంబో టు మినీ..టీడీపీ కార్యవర్గంలో మార్పులు
- టీడీపీ స్టేట్ కమిటీ నియామకంపై కసరత్తు కంప్లీట్
- 400 పోస్టులను..175కు తగ్గిస్తారని తమ్ముళ్ల టాక్
- యువత, మహిళలు, బీసీలకు ప్రాధాన్యతపై చర్చ
Tdp : అందరి లెక్కలు ఆ పదవులపైనే. ఓ వైపు సీనియారిటీ..మరోవైపు క్యాస్ట్ ఈక్వేషన్స్..ఇంకోవైపు ప్రభుత్వంలో పదవులు దక్కని నేతలు..ఇలా ఆశావహులందరినీ సెట్ చేసి తమ్ముళ్లకు న్యాయం చేయాలి. ఇదే టీడీపీ హైకమాండ్ ముందున్న అతి పెద్ద సవాల్. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పదవి దక్కని వాళ్లు..పార్టీ పదవులపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయినా సరే పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని స్మాల్ ప్యాక్‌గా మార్చే ఆలోచన చేస్తున్నారట సైకిల్ పార్టీ పెద్దలు. కార్యవర్గంపై టీడీపీ అధిష్టానం లెక్కలేంటి? పదవుల రేసులో బోలెడంత మంది ఉంటే..వందల పోస్టులతో ఆశావహులను ఎలా స్యాటిస్ఫై చేయబోతున్నారు?
పార్టీ ప్రభుత్వంలో ఉంది. కూటమి పార్టీలతో పొత్తులో ఉంది. నామినేటెడ్ పదవులు దక్కని నేతలకు..పార్టీ పదవులపై హోప్స్ ఉన్నాయి. పార్టీ స్టేట్ కమిటీలో చోటు సంపాదించి..రాష్ట్ర నాయకుడిగా పాపులర్ కావాలనే కల కంటున్న వాళ్లు ఎందరో. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఎంపిక ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 13వ తేదీలోగా కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర కార్యవర్గంలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు..ఇలా వివిధ పదవుల్లో దాదాపు 150 నుంచి 175 మందిని నియమించనున్నారు.
చంద్రబాబు సూచనలతో జాబితాలో మార్పులు..
పాత కమిటీలో దాదాపు 400 మంది వరకు ఉండగా, దాన్ని ఈసారి 175కి మించకుండా చూడాలని హైకమాండ్ నిర్ణయించిందట. పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఎంపిక చేసేందుకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడితో ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసి..జాబితాను పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు అందజేసిందని అంటున్నారు. తర్వాత అధినేత సూచనల ప్రకారం పలు మార్పులు చేసి తుది జాబితా ప్రకటిస్తారని చెబుతున్నారు. ఈ నెల ఆరో తేదీనే జాబితా ప్రకటించాలని భావించినా, మార్పులు చేయాల్సి రావడంతో..12 లేదా 13న ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర కార్యవర్గంలో మహిళలకు 30 శాతానికి తగ్గకుండా పోస్టులు కేటాయించనున్నారు. యువతకు, బీసీ వర్గాలకు సముచిత ప్రాధాన్యమిస్తారట.
సుదీర్ఘ కాలం స్టేట్ కమిటీలో కొనసాగుతున్న వారిని తప్పించి..
లోకేశ్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర కమిటీ కూర్పు జరుగుతుందని అంటున్నారు. సుదీర్ఘ కాలం స్టేట్ కమిటీలో కొనసాగుతున్న వారిని తప్పించి..వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించాలని భావిస్తున్నారట. ఒకే పదవిలో వరుసగా మూడుసార్లు పనిచేసిన వారిని మార్చాలని లోకేశ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. పార్టీ పొలిట్ బ్యూరోలో కూడా కొత్తవారికి చోటు కల్పిస్తారని చెప్పుకుంటున్నారు. జిల్లా కమిటీలలో తనదైన మార్క్ చూయించిన లోకేశ్..రాష్ట్ర కమిటీలో కూడా సమూల మార్పులతో క్యాడర్, లీడర్లలో జోష్ పెంచే స్కెచ్ వేస్తున్నారట. నాయకుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామంటూ ముందే హెచ్చరిస్తున్న లోకేశ్.. చంద్రబాబు సూచనల ప్రకారం కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని డిసైడ్ అయ్యారట.
ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు కావొస్తోంది. పవర్లోకి వచ్చాం సరే..పదవుల మాటేమిటని తెలుగు తమ్ముళ్లు ఎదురు చూస్తూనే ఉన్నారు. నామినేటెడ్ పోస్టులు దక్కని వారు..పార్టీ పదవులపై నమ్మకం పెట్టుకున్నారు. పైగా గత ఎన్నికలకు ముందు వైసీపీతో సహా వివిధ పార్టీల నుంచి వచ్చి టీడీపీలో చేరిన లీడర్ల సంఖ్య పెద్దగానే ఉంది. దీంతో టీడీపీలో పాత, కొత్త నేతలకు పదవులు కట్టబెట్టడం తెలుగుదేశం పార్టీ హైకమాండ్‌కు సవాల్‌గా మారిందట. పార్టీ కమిటీల నియామకంలో అయితే సీఎం చంద్రబాబు కూడా ఒత్తిళ్లు ఫేస్ చేయాల్సి వస్తోందట.
400 పోస్టులు.. 175కి కుదింపు?
ఓవైపు సీనియర్లు..ఇంకోవైపు క్యాస్ట్ ఈక్వేషన్స్, మరోవైపు పార్టీ కోసం కష్టపడ్డోళ్లు, గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన నేతలు..ఇలా అందరికి పదవులు అకామిడేట్ చేయడం కోసం తీవ్ర కసరత్తే చేస్తున్నారట. పార్టీ అధికారంలో ఉండటం, స్థానిక ఎన్నికల రానుండటంతో పాటు..భవిష్యత్ రాజకీయ అంచనాల నేపథ్యంలో పదవులపై నేతలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ప్రభుత్వ పరమైన పదవులు లేకపోయినా, పార్టీ పదవులు ఉంటే తమ ప్రాంతంలో విలువ ఉంటుందనే భావనతో ఎక్కువ మంది నేతలు కార్యవర్గంలో చోటు కోసం రేసులో ఉన్నారట. అయితే ఇంత ప్రెజర్ ఉన్నా..కార్యవర్గంలో 400 పోస్టులను 175కు కుదిస్తే ఏకంగా 225 పదవులు తగ్గిపోనున్నాయి.175 పోస్టులు అంటే నియోజకవర్గానికి ఒక పదవి దక్కే అవకాశం ఉంది. మరి పార్టీ పదవుల పంపకాన్ని ఎలా పూర్తి చేస్తారో.. అసంతృప్తులకు ఎలా సంతృప్తి పరుస్తారో చూడాలి మరి.
