Gossip Garage : హాట్ టాపిక్‌గా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రత్యేక భేటీ.. ఆ ప్రచారానికి చెక్‌ పెట్టినట్లేనా?

గ్యాప్ క్రియేట్ చేసేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలు ఫలించవని అంటున్నారు కూటమి నేతలు. ఈ ఇద్దరి నేతల భేటీ సారాంశం ఏంటో రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Gossip Garage : హాట్ టాపిక్‌గా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రత్యేక భేటీ.. ఆ ప్రచారానికి చెక్‌ పెట్టినట్లేనా?

Pawan and chandrababu

Updated On : March 19, 2025 / 1:58 AM IST

Gossip Garage : ఆ ఇద్దరు వన్‌ టు వన్‌ భేటీ అయ్యారు. కూటమిలో రెండు కీలక పార్టీల అధ్యక్షులు.. పైగా సీఎం, డిప్యూటీ సీఎం సమావేశంపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇంట్రెస్టింగ్‌ చర్చ జరుగుతోంది. చాలా రోజుల తర్వాత జరిగిన ప్రత్యేక భేటీ వెనుక ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయట. రెండు పార్టీల లీడర్లు, క్యాడర్ మధ్య కన్ఫ్యూజన్స్, క్లాషెస్‌ ఉన్నాయన్న ప్రచారానికి చెక్‌ పెట్టాలని ఫిక్స్ అయ్యారట. పదవుల భర్తీపై కూడా ఓ నిర్ణయానికి వచ్చారంటున్నారు. ఇంతకీ బాబు, పవన్‌ భేటీలో ఏం చర్చించారు? నామినేటెడ్ పదవుల పంపకం ఫైనల్ అయినట్లేనా?

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ..ఏపీ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇద్దరూ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. రెగ్యులర్‌గా క్యాబినెట్ భేటీలు, అసెంబ్లీ సమావేశాల్లో కలుసుకుంటున్నారు. అయినా ప్రత్యేకంగా భేటీ అయ్యారంటే ఏదో సీరియస్ మ్యాటర్ అయి ఉంటుందన్న చర్చ జరుగుతోంది.

ఏదో కీలక అంశంపై డిస్కస్ చేసి ఉంటారన్న టాక్..
బాబు, పవన్ ఇద్దరూ రోజంతా అసెంబ్లీలో కనిపించారు. మధ్యాహ్నం తర్వాత మంత్రివర్గ భేటీలో కలిసే ఉన్నారు. నెక్ట్స్‌ ప్రత్యేకంగా వన్ టు వన్ భేటీ అయ్యారు. అలా వన్‌ టు వన్‌ భేటీ జరిగిందంటే ఏదో కీలక అంశంపై డిస్కస్ చేసి ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యలో జరిగిన రాజకీయ పరిణామాల మీదనే ఈ ఇద్దరు చర్చించి ఉంటారని అంటున్నారు.

ఏపీలో జనసేన ఆవిర్భావ సభ పెద్ద ఎత్తున సాగింది. ఈ సభలో పవన్, నాగబాబు చేసిన కామెంట్స్ మీద టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోందని అంటున్నారు. పవన్‌ను ఎవరైనా గెలిపించారనుకుంటే అది వాళ్ల ఖర్మ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలతో కాస్త గ్యాప్ క్రియేట్ అయిందన్న ప్రచారం జరుగుతోంది.

Also Read : ఇది ప్రతీకారమే..! నాడు జగన్ చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నారు- వైఎస్ షర్మిల

సోషల్ మీడియాలో జనసేన టీడీపీ యాక్టివిస్టుల మధ్య వార్..
సోషల్ మీడియాలో అయితే జనసేన టీడీపీ యాక్టివిస్టుల మధ్య వార్ వేరే లెవెల్‌లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య గ్రౌండ్ లెవెల్‌లో క్లాషెస్‌ వచ్చాయన్న భావన అయితే వ్యక్తం అవుతోంది. అయితే పైస్థాయిలో మాత్రం చంద్రబాబు పవన్ మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉందని అంటున్నారు. దాంతో ఈ భేటీలో ఇద్దరు నేతలు లేటెస్ట్ పొలిటికల్ డెవలప్‌మెంట్స్‌ మీద డిస్కస్ చేసి ఉంటారని అంటున్నారు.

ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ఆయన ప్రధాని మోదీని కలసి అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి రావాలని ఇన్వైట్ చేస్తారని అంటున్నారు. ఈ విషయాలపై కూడా బాబు, పవన్ భేటీలో డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిన నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవడంపై కూడా చంద్రబాబుతో పవన్ చర్చించి ఉంటారని అంటున్నారు.

ఈ నెలాఖరు నుంచి నాగబాబు శాసన మండలి సభ్యుడిగా ఉంటారు. దాంతో ఆయనకు ముందస్తుగా ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. దాని మీద బాబుతో పవన్ డిస్కస్ చేశారని టాక్. మంత్రిగా నాగబాబు ప్రమాణస్వీకార తేదీ, ఆయనకు ఇచ్చే శాఖల మీద చర్చ సాగి ఉంటుందని అంటున్నారు.

ఇక త్వరలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పోస్టులపై కూడా డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది. పదవుల పంపకంతో పాటు జనసేన నుంచి ఎవరెవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై పవన్‌ బాబుకు ఓ లేఖ ఇచ్చినట్లు చెబుతున్నారు. త్వరలోనే కార్పొరేషన్ పోస్టుల లిస్ట్ విడుదల చేస్తారని..బాబు, పవన్‌ భేటీలో కీలకంగా పదవుల షేరింగ్ మీదే చర్చ చేసి ఉంటారని అంటున్నారు.

Also Read : వర్మ నామినేటెడ్‌ పోస్ట్ తీసుకుంటారా? పదవుల రేసులో ఉన్న ఈ నేతలకు తీపికబురు ఎప్పుడు?

అయితే బాబు ఛాంబర్‌కు వెళ్ళి పవన్‌ ఆయనతో మాట్లాడటం బట్టి చూస్తే జరుగుతున్నది వేరు కూటమి పార్టీల అధినేతల మధ్య ఉన్న బాండింగ్‌ వేరన్న చర్చ జరుగుతోంది. కూటమిని కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లే విషయంలో బాబు, పవన్‌కు ఒక ఏకాభిప్రాయం ఉందని అంటున్నారు. గ్యాప్ క్రియేట్ చేసేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలు ఫలించవని అంటున్నారు కూటమి నేతలు. ఈ ఇద్దరి నేతల భేటీ సారాంశం ఏంటో రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.