మరో పదేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలి..! పవన్ కల్యాణ్ అలా అనడానికి కారణం అదేనా?

పవన్‌ కల్యాణ్ ఏం చేసినా ఓ క్లారిటీతో చేస్తారన్న టాక్ ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన స్టార్టింగ్‌లోనే ఓడినా వెనక్కి తగ్గలేదు జనసేనాని.

మరో పదేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలి..! పవన్ కల్యాణ్ అలా అనడానికి కారణం అదేనా?

Gossip Garage Chandrababu Pawan Kalyan (Photo Credit : Google)

Updated On : November 21, 2024 / 12:21 AM IST

Gossip Garage : కలిసే ఉంటాం. కలకాలం కూటమిగానే పోటీ చేస్తామని చంద్రబాబు అంటున్నారు. పెద్దాయనే సీఎం..ఇంకో పదేళ్లు ఆయన నాయకత్వంలో పాలన సాగాలని..జనసేనాని కోరుకుంటున్నారు. బాబు అనుభవం ఏపీకి చాలా అవసరమని కూడా పవన్ అంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఆ ఇద్దరి ఆలోచన ఒకేలా ఉందన్న చర్చ జరుగుతోంది. లాంగ్‌ లివ్‌ కూటమి అని బాబు ఇచ్చిన హింట్‌కు పవన్‌ సపోర్ట్ చేసినట్లేనా? ఇద్దరు ముఖ్యనేతలు ఒకే లైన్‌లో ఉండటాన్ని ఎలా చూడొచ్చు? వ్యక్తిగత ప్రయోజనం కంటే ఏపీ బాగోగులే ముఖ్యమని పవన్ అనుకుంటున్నారా? కూటమి కోసం బాబు..విజనరీకి అండగా పవన్.. ఈ దోస్తీ ఎక్కడి దాకా.?

అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చేస్తున్న చంద్రబాబు, పవన్..
ఇట్స్ వెరీ ఎర్లీ. ఎన్నికలు అయిపోయి ఆరు నెలలు కూడా కాలేదు. ఇంకో నాలుగున్నరేళ్లు ఏపీలో కూటమే అధికారంలో ఉంటుంది. అయినా అప్పుడే అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రాబోయే ఎన్నికల సినారియో ఎలా ఉంటుందో..వచ్చే ఐదేళ్లలో ఎవరు సీఎంగా ఉంటారో..హింట్‌లు ఇస్తూ కన్ఫ్యూజన్‌ లేకుండా..క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యే సీఎం చంద్రబాబు ఢిల్లీ వేదికగా చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశం అవుతుంటే.. అంతలోనే ఏపీ అసెంబ్లీ వేదికగా జనసేన చీఫ్‌ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. అవును ఆ ఇద్దరినీ ఎవరూ విడదీయలేరు. ఆ మూడు పార్టీలను కలవనీయకుండా ఎవరూ అడ్డుకోలేరన్న స్పష్టత కనిపిస్తోంది.

హాట్ టాపిక్ గా మారిన పవన్ కామెంట్స్..
జమిలి ఎన్నికలు వచ్చినా..2029లో ఎలక్షన్స్‌ జరిగినా కలసే పోటీ చేస్తాం..ఇప్పటికే నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నామంటూ బాబు చెప్పడం పొలిటికల్‌ హీట్ క్రియేట్‌ చేస్తోంది. కూటమిలో ఎలాంటి సమస్యలు లేవని, కలిసికట్టుగా ముందుకెళ్తున్నామని చెప్పిన చంద్రబాబు..నరేంద్ర మోదీనే తమ నాయకుడని స్పష్టం చేశారు. అక్కడక్కడ కూటమి నేతల మధ్య గ్యాప్ ఉంది..కలసి నడవటం లేదన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో బాబు చేసిన కామెంట్స్‌తో కొంత సెట్‌రైట్‌ అయ్యే పరిస్థితి కనిపించింది. అంతలోనే బాబు కామెంట్స్‌కు బలం చేకూరుస్తూ..ఇంకో మెట్టు దిగి మరీ పవన్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నవ్యాంధ్ర పొలిటికల్‌ సీన్‌ను సీన్‌ సితార చేయబోతున్నాయి.

పవన్‌ కల్యాణ్‌ మాటలతో కూటమి ఇంకా స్ట్రాంగ్‌ అవుతుందన్న నేతలు..
మరో పదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉండాలంటూ అసెంబ్లీ వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఒక క్రైసిస్ వచ్చినప్పుడు నాయకుడు ఎలా ఉండాలనేది చంద్రబాబును చూస్తే అర్థమవుతుందన్నారు పవన్. బుడమేరు వరద వచ్చినప్పుడు ఆయన చూపించిన చొరవ ఎంతో గొప్పదన్న పవన్..అనుభవమున్న చంద్రబాబు పరిపాలనలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. సీఎం చంద్రబాబుకు మాట ఇస్తున్నా..తాము చేయాల్సిన పనులపై ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు. సీఎం చంద్రబాబు విజన్‌కు తగ్గట్టు పనిచేస్తాం..సీఎం కలలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. మొన్న చంద్రబాబు..ఇప్పుడు పవన్‌ వ్యాఖ్యలు చూస్తుంటే ఒకే లైన్‌లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. కూటమి లాంగ్‌ టర్మ్‌లో ఉంటుందని బాబు అంటుంటే..కూటమే కాదు బాబే మరో పదేళ్లు సీఎంగా ఉంటారని పవన్‌ అనడం అయితే ఆసక్తికరంగా మారింది. పవన్‌ కల్యాణ్‌ మాటలతో కూటమి ఇంకా స్ట్రాంగ్‌ అవుతుందని అంటున్నారు నేతలు.

సీఎం పోస్ట్ వద్దని పవన్ చెప్తున్నారా?
అయితే పవన్ వ్యాఖ్యలపై ఇంకో చర్చ మొదలైంది. బాబే సీఎంగా ఉండాలంటున్నారంటే పవన్‌ సీఎం పోస్ట్ వద్దని చెప్తున్నారా అన్న మాటలు అపోజిషన్‌ నుంచి వినిపిస్తున్నాయి. పవన్‌కు మంచి ఫాలోయింగ్‌ ఉంది. క్రౌడ్ పుల్లర్ కూడా. కానీ పాలనా అనుభవం లేదు. ఈ విషయం ఎవరో చెప్పాల్సిన అసవరం లేదు. తనకు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టులేదని..చంద్రబాబు, ఇతర మంత్రులను చూసి నేర్చుకుంటున్నానని పలుమార్లు పవన్‌ కల్యాణే చెప్పారు. ఆ మాటలకు తగ్గట్లుగానే బాబే సీఎంగా ఉండాలని పవన్ అంటున్నారని చెబుతున్నారు కూటమి నేతలు.

పట్టు, అనుభవం వచ్చాకే..అందుకు తగ్గ పోస్ట్‌లో కూర్చోవాలనే ఆలోచన..
పవన్‌ కల్యాణ్ ఏం చేసినా ఓ క్లారిటీతో చేస్తారన్న టాక్ ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన స్టార్టింగ్‌లోనే ఓడినా వెనక్కి తగ్గలేదు జనసేనాని. రెండోసారి సత్తా చాటలేకపోయినా భయపడలేదు. కానీ మూడోసారి బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. అందులో ఆయనేది కీరోల్. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్‌ విషయంలో కూడా పూర్తిగా అవగాహన లేకుండా దేంట్లో వేలు పెట్టొద్దనేది పవన్‌ ఆలోచనగా చెప్తున్నారు కొందరు జనసేన నేతలు. ప్రభుత్వం నడిపే విషయంలో పూర్తిగా పట్టు, అనుభవం వచ్చాకే..అందుకు తగ్గ హోదాలో కూర్చోవడం బెటర్‌ అనుకుంటున్నారని..ఎవరెన్ని విమర్శలు చేసినా పవన్‌ దూరదృష్టికి ఎవరూ సాటిరాలేరని అంటున్నారు.

ఇవన్నీ ఎలా ఉన్నా బాబు, పవన్‌ ఒకే స్టాండ్ మీద ఉండటం మాత్రం..కూటమి నేతలకు మంచి ఇండికేషన్‌ ఇచ్చినట్టు అవుతోంది. ఫ్యూచర్‌ ఉంది. కన్ఫ్యూజ్‌ కావాల్సిన పనిలేదు. క్లాషెస్‌ పెట్టుకోవద్దన్న అధినేతలే క్లారిటీ ఇవ్వడంతో.. అక్కడక్కడ ఏమైనా గ్యాప్స్‌ ఉంటే త్వరలో గ్రౌండ్‌లో అంతా సెట్‌ అయిపోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతలు.

Also Read : ఎగ్జిట్ పోల్స్.. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో కమల వికాసం..! ఎన్డీయే కూటమి వైపే సర్వే సంస్థల మొగ్గు..