Chandrababu : కలిసి పనిచేద్దాం.. జగన్‌ను ఇంటికి పంపుదాం : చంద్రబాబు

కలిసి పనిచేద్దాం.. జగన్‌ను ఇంటికి పంపుదాం అంటూ జనసేన నేతలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.

Chandrababu : కలిసి పనిచేద్దాం.. జగన్‌ను ఇంటికి పంపుదాం : చంద్రబాబు

Chandrababu ..Janasena

Chandrababu ..Janasena : టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన నేతలు భేటీ అయ్యారు. జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్,గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావులు చంద్రబాబుని కలిశారు. వారితో చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని..అందరు సమన్వయంతో కలిసి మెలిసి పనిచేయాలని సూచించారు. తెలుగుదేశం,జనసేన కార్యక్రమాల్లో నేతలు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు.

ప్రతీ కార్యక్రమంలో తెలుగుదేశం,జనసేన నేతలు కలిసి వేదికను పంచుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో కూడా ఇరు పార్టీల నేతలు కలిసి మెలిసి పనిచేస్తు..జగన్ ను ఇంటికి సాగనంపుదామన్నారు.ప్రజా సమస్యలపై గ్రామస్థాయిలో కూడా కలిసి పోరాడుదామని జనసేన నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Chandrababu : గెలుపు గుర్రాలకే టిక్కెట్లు.. పని బాగాలేకపోతే పక్కన పెట్టేస్తా : చంద్రబాబు

ఇప్పటికే ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా ఇరు పార్టీలు పలు కార్యక్రమాల్లో కలిసి మెలిసి పనిచేస్తున్నారు. ఇరు పార్టీల అధినేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తునే..పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పక్కా ప్లాన్ తో ముందుకెళుతున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే యత్నాల్లో ఉన్నారు.