Andhra Pradesh Education System: ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థపై స్విట్జర్లాండ్ మాజీ దేశాధ్యక్షుడి ప్రశంసలు

Andhra Pradesh Education System: ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థపై స్విట్జర్లాండ్ మాజీ దేశాధ్యక్షుడు ఇగ్నాజియో డానియెల్ గియోవన్నీ కాసిస్ ప్రశంసలు కురిపించారు.

Andhra Pradesh Education System: ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థపై స్విట్జర్లాండ్ మాజీ దేశాధ్యక్షుడి ప్రశంసలు

Updated On : February 25, 2023 / 3:30 PM IST

Andhra Pradesh Education System: ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థపై స్విట్జర్లాండ్ మాజీ దేశాధ్యక్షుడు ఇగ్నాజియో డానియెల్ గియోవన్నీ కాసిస్ ప్రశంసలు కురిపించారు. విద్యావ్యవస్థ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన మెచ్చుకున్నారు. జెనీవా నగరంలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో గురువారం ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఫర్ ప్యూచర్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఇగ్నాజియో ప్రసంగిస్తూ.. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ముఖ్యంగా విద్యావ్యవస్థ అభివృద్ధికి తీసుకున్న చర్యలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా విద్యావ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కొందని.. భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇలాంటి పరిస్థితి లేదని అన్నారు.

పేద విద్యార్థుల కోసం సీఎం వైఎస్ జగన్ చేపట్టిన పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు సత్పలితాలు ఇస్తున్నాయని పొగిడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తయారు చేస్తోందని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను ఇగ్నాజియో స్పెషల్ గా ప్రస్తావించారు.

Nara Lokesh: కోవిడ్ టైంలో బ్రాహ్మణికి దొరికిపోయా.. ఇప్పటికీ కంట్రోల్ తప్పితే మెస్సేజ్ వచ్చినట్లే..

ఎడ్యుకేషన్ ఫర్ ప్యూచర్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్విట్జర్లాండ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ పాట్రిసియా దన్జీ.. ఏపీ స్టాల్ ను సందర్శించి, ప్రభుత్వ పథకాల గురించి ఆసక్తిగా విన్నారు. ఇంటర్నేషనల్ యూనిసెఫ్ ప్రోగ్రామ్స్ స్పెషలిస్ట్ అతెనా లౌబాచెర్ కూడా ఏపీ స్టాల్ ను సందర్శించారు. భారత్ నుంచి ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యుడు వున్నవ షకీన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.