MP Kotagiri Sridhar: దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉంది

వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉందని అన్నారు. వచ్చేఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గి వైసీపీకి పెరుగుతాయని, ప్రత్యేక హోదా కూడా సాధిస్తామనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.

MP Kotagiri Sridhar: దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉంది

Mp Kotagiri Sridhar Babu

Updated On : July 6, 2022 / 4:25 PM IST

MP Kotagiri Sridhar: వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉందని అన్నారు. వచ్చేఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గి వైసీపీకి పెరుగుతాయని, ప్రత్యేక హోదా కూడా సాధిస్తామనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. బుధవారం ఏలూరులో జిల్లా ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడారు. గతంలో ప్రజలు టీడీపీపై కోపంతో వైసీపీకి ఓట్లేశారని, రానున్న ఎన్నికల్లో వైసీపీపై ప్రేమాభిమానాలతో ఓటు వేయబోతున్నారని అన్నారు.

YCP Politics : ‘సొంత పార్టీవారే కుట్రలు చేస్తున్నారు..’వైసీపీ నేతలు బాలినేని..కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

పార్టీ గెలుపుకోసం పనిచేసే కార్యకర్తలు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేశారని, ఇంకా వారికి ప్రభుత్వం నుంచి బిల్లు రాకపోయినా బాధపడటం లేదని అన్నారు. పార్టీకోసం పని చేసేందుకు మరింత ఉత్సాహంతో ముందుకు సాగటం సంతోషంగా ఉందన్నారు. ఇతర రాష్ట్రాలకంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని అన్నారు. కొల్లేరు అభివృద్ధికి త్వరలో ముఖ్యమంత్రి శ్రీకారం చుడతారని, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కోటగిరి శ్రీధర్ బాబు అన్నారు.

Andhra Pradesh: మళ్ళీ అధికారంలోకి రావడానికి టీడీపీ ఇలా చేసింది: భూమ‌న‌

ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళ్లాలని, తద్వారా జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసే బాధ్యత తీసుకోవాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.