శాడిస్టు పాలన.. శత దిన విధ్వంసం.. శత దిన వినాశకం: కాకాణి గోవర్ధన్ రెడ్డి
వరద నిర్వహణలో దారుణంగా విఫలమయ్యారని, పబ్లిసిటీ తప్ప బాధితులకు సాయం శూన్యమని విమర్శించారు.

Kakani Govardhan Reddy
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది 100 రోజుల శాడిస్టు పాలన అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ పాలన శత దిన విధ్వంసం, శత దిన వినాశకం అని వ్యాఖ్యానించారు. అమరావతిలో కాకాణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఈ వంద రోజుల్లో చంద్రబాబు కక్ష సాధింపులు తప్ప ఇంకేం చేశారని ప్రశ్నించారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చి అందరినీ ముంచారని ప్రజలు అనుకుంటున్నాని తెలిపారు. వరద నిర్వహణలో దారుణంగా విఫలమయ్యారని, పబ్లిసిటీ తప్ప బాధితులకు సాయం శూన్యమని విమర్శించారు. 20 రోజులు అవుతున్నా ఇంకా నీరు తొలగింపు జరగలేదని, డైవర్షన్ కోసం బ్యారేజ్ మీదకు పడవలు వదిలారని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు.
మొదటి సంతకం పెట్టిన డీఎస్సీ ప్రోసెస్ ఏమైందని నిలదీశారు. తమ పాలనలో ఎన్నో భూ సంస్కరణలు తెచ్చామని, వాటిని పక్కన పెట్టారని చెప్పారు. పోలవరానికి వచ్చిన 12,500 కోట్ల రూపాయల నిధులు వైసీపీ పాలనలో వచ్చినవని తెలిపారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయని విమర్శించారు. 100 రోజుల పాలన బుక్ లెట్ చూస్తే నవ్వాలో ఏడాలో తెలియడం లేదని అన్నారు. అంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు పూర్తి బడ్జెట్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. హామీలు ఎగొట్టడానికి బడ్జెట్ పెట్టలేదని అన్నారు.
అన్ని పేజర్లు ఎలా పేలిపోయాయి? ఇది మొసాద్ గతంలో చేసిన ఆపరేషన్ల వంటిదేనా?