Kakani Govardhan Reddy: పవన్ కల్యాణ్‌వి పార్ట్ టైం ఛాలెంజ్‌లు.. ఇక చంద్రబాబు.. : మంత్రి కాకాణి

ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఇతర పార్టీలన్నీ కలిసి వచ్చి తమపై పోటీ చేసినా తామే గెలుస్తామని చెప్పారు.

Kakani Govardhan Reddy: పవన్ కల్యాణ్‌వి పార్ట్ టైం ఛాలెంజ్‌లు.. ఇక చంద్రబాబు.. : మంత్రి కాకాణి

Kakani Govardhan Reddy

Updated On : June 19, 2023 / 8:48 PM IST

Kakani Govardhan Reddy- YCP: విజయవాడ (Vijayawada) నగరంలో రెండు రైతు బజార్లను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. అంబేద్కర్ విగ్రహ నిర్మాణం జరుగుతుండటంతో స్వరాజ్య మైదానంలోని రైతు బజారును తరలించిన విషయం తెలిసిందే. రెండు రైతు బజార్లుగా వేర్వేరు చోట్ల ప్రారంభించారు.

ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనపై మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌వి పార్ట్ టైం ఛాలెంజ్‌లు అని విమర్శించారు. పక్క రాష్ట్రాలవి కాపీ కొట్టడం చంద్రబాబు నాయుడికి అలవాటని చెప్పారు. ఎన్నో హామీలు ఇస్తున్నారని చెప్పారు. ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఇతర పార్టీలన్నీ కలిసి వచ్చి తమపై పోటీ చేసినా తామే గెలుస్తామని అన్నారు.

గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీ కంటే ఈ సారి ఎక్కువ మెజార్టీనే వస్తుందని తెలిపారు. కాగా, రైతు బజార్లు కస్టమర్లు, రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 103 రైతు బజార్లు ఉన్నాయని తెలిపారు. దివ్యాంగులకు స్టాళ్లు కేటాయించామని చెప్పారు.

Ram Gopal Varma : సీఎం జగన్‌తో RGV భేటీ.. గంటకు పైగా జరిగిన చర్చ.. వ్యూహం సినిమాకు..