Kollu Ravindra: విశాఖ ఉక్కును కాపాడింది ఆయనే: రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర

గత వైసీపీ పాలనలో కేవలం భూ దోపిడీ కోసం మాత్రమే స్టీల్ ప్లాంట్ వ్యవహారం నడిపారని తెలిపారు.

Kollu Ravindra: విశాఖ ఉక్కును కాపాడింది ఆయనే: రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర

Kollu Ravindra

Updated On : January 21, 2025 / 4:34 PM IST

విశాఖ ఉక్కును కాపాడింది ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇవాళ ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర సాయం చేసిందని చెప్పారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరహార దీక్ష చేశారని కొల్లు రవీంద్ర గుర్తుచేశారు. గత వైసీపీ పాలనలో కేవలం భూ దోపిడీ కోసం మాత్రమే స్టీల్ ప్లాంట్ వ్యవహారం నడిపారని తెలిపారు.

రైల్వే జోన్ భవనాలు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించారని కొల్లు రవీంద్ర చెప్పారు. కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్త శుద్ధికి ఇదే నిదర్శనమని తెలిపారు. 99 శాతం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ఎర్త్ పనులు పూర్తి అయ్యాయని అన్నారు. 37 శాతం రన్ వే పనులు జరిగాయని, దేశంలో గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ ముందుంటుందని చెప్పారు.

బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయని కొల్లు రవీంద్ర అన్నారు. అనకాపల్లిలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ మీద ఆర్సిలర్ సంస్థ మిట్టల్‌తో సీఎం చంద్రబాబు దావోస్‌లో ఏంవోయూ కుదుర్చుకున్నారని చెప్పారు. ఐదేళ్ల క్రితం జగన్ ప్రభుత్వం విశాఖలో భూములు కొట్టేసిందని ఆరోపించారు.

విశాఖకు టీసీఎస్ ,గూగుల్, సంస్థలు వస్తున్నాయని చెప్పారు. పోలవరం పనులు వేగంగా జరుగుతాయని కొల్లు రవీంద్ర అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం నుంచి అన్ని నిధులు సాయంగా రావడం అంత చిన్న విషయం కాదని చెప్పారు.

Mamata Banerjee: అతడికి మరణశిక్ష వేయాల్సిందే.. హైకోర్టుకు మమతా బెనర్జీ సర్కార్‌