ప్రేమపెళ్లి, అనుమానం మొగుడు – ఆత్మహత్య చేసుకున్న భార్య

ప్రేమపెళ్లి, అనుమానం మొగుడు – ఆత్మహత్య చేసుకున్న భార్య

Updated On : January 31, 2021 / 3:03 PM IST

married woman suicide in vijayawada : ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుమానం మొగుడితో వేగలేక తనువు చాలించిందో ఇల్లాలు. విజయవాడ పాతబస్తీ మహంతీపురం అప్పల స్వామి వీధిలో వాసుపల్లి గురుమూర్తి, సాయి దివ్య(24) నివాసం ఉంటున్నారు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. 2016లో పెళ్లి చేసుకున్నారు. వీరికి మూడేళ్ల పాప ఉంది.

భర్త గురుమార్తి కెమికల్ షాపులో పని చేస్తున్నాడు. అయితే అతనికి భార్యపై అనుమానం మొదలైంది. ఈవిషయమై తరచూ భార్యా భర్తలు గొడవ పడుతుండేవారు. ఈక్రమంలో శనివారం రాత్రి కూడా గొడవ పడ్డారు. భర్త తనపై అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడటంతో మనస్తాపానికి గురైన సాయి దివ్య శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సమాచారం తెలుసుకున్న కొత్తపేట పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చిశవ పంచానామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఝూన్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.