కార్యకర్తల ఇష్టప్రకారమే నడుచుకుంటా, ఇంకా 2 నెలల సమయం ఉంది- మంత్రి సంచలన ప్రకటన

మీ నిర్ణయం పైనే నా రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. అభ్యర్థులను ఖరారు చేసినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నామినేషన్ వేసిన తర్వాత సైతం అభ్యర్థులను మార్చిన సంఘటనలు అనేకం చూశాము.

కార్యకర్తల ఇష్టప్రకారమే నడుచుకుంటా, ఇంకా 2 నెలల సమయం ఉంది- మంత్రి సంచలన ప్రకటన

Minister Gummanur Jayaram

Updated On : January 12, 2024 / 6:45 PM IST

Gummanur Jayaram : ఎన్నికల్లో మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీలో సీఎం జగన్ చేస్తున్న మార్పులు చేర్పులు చిచ్చు రాజేస్తున్నాయి. నియోజకవర్గాల ఇంఛార్జిల మార్పుల్లో భాగంగా సీఎం జగన్.. కొందరు ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు. మరికొందరికి స్థానచలనం చేశారు. ఇంకొందరిని ఎంపీలుగా బరిలోకి దింపుతున్నారు. అయితే, కొందరు ఎమ్మెల్యేలకు జగన్ నిర్ణయాలు మింగుడుపడటం లేదు. టికెట్ రాదని కన్ ఫర్మ్ కావడంతో పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. మరికొందరు ఎంపీగా పోటీ చేయడం ఇష్టలేక పార్టీకి రాజీనామా చేసే యోచన చేస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి, ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన ప్రకటన చేశారు.

కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు మంత్రి గుమ్మనూరు జయరాం విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో కార్యకర్తలు, అభిమానులతో సమావేశం అయ్యారు గుమ్మనూరు జయరాం. ఎంపీగా వెళ్లాలా? లేదా? అన్నది కార్యకర్తలే తేల్చాలని అన్నారాయన. అభ్యర్థులను ఖరారు చేసినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంకా రెండు నెలల సమయం ఉందంటూ హాట్ కామెంట్స్ చేశారు గుమ్మనూరు జయరామ్.

Also Read : ఎన్నికల వేళ రాజకీయాన్ని తనవైపు తిప్పుకున్న ముద్రగడ

వైసీపీ ఇంఛార్జిల మార్పులు చేర్పుల్లో భాగంగా నిన్న మూడో జాబితా విడుదల చేశారు సీఎం జగన్. అందులో ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరామ్ ను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు జగన్. అయితే, ఎంపీగా పోటీ చేయడం తనకు ఇష్టం లేదని, ఆలూరు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని జయరాం అంటున్నారు. తనకు ఆలూరు ఎమ్మల్యే అభ్యర్థి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారాయన.

”15 ఏళ్ళుగా నాకు సహకరించిన కార్యకర్తలకు ఎంతో రుణపడి ఉంటా. మంత్రిగా మనం రూలింగ్ లో ఉన్నా ఎక్కడా కూడా దౌర్జన్యం చేయలేదు. మంత్రిగా నేను ఏనాడూ గొడవలను ప్రోత్సహించలేదు. వ్యక్తిగత కక్షలు లేకుండా ఉన్నాము. నేను కర్నూలు ఎంపీ టిక్కెట్ జేబులో పెట్టుకుని వచ్చాను. కార్యకర్తలు అభీష్టం మేరకే నడుచుకుంటా.

మీ నిర్ణయం పైనే నా రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ఇంకా 2 నెలలు సమయం ఉంది. అభ్యర్థులను ఖరారు చేసినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నామినేషన్ వేసిన తర్వాత సైతం అభ్యర్థులను మార్చిన సంఘటనలు అనేకం చూశాము. నన్ను ఎంపీగా వెళ్లమంటారా లేదా అనేది మీరే తేల్చండి. కార్యకర్తలు అదేశిస్తే అనేక దారులు ఉన్నాయి. మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గుమ్మనూరు జయరాం.

Also Read : ఆ 5 స్థానాలు టీడీపీకా? జనసేనకా? తూర్పుగోదావరి జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ