Free Bus Ride: మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్‌పై బిగ్ అప్‌డేట్.. ఈ 5 కేటగిరీల బస్సుల్లో ఉచిత ప్రయాణం.. వారు మాత్రమే అర్హులు.. ఇంకా..
ఇందుకోసం రూ.1950 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి రాంప్రసాద్ తెలిపారు.

Free Bus Ride: ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ పై కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఫ్రీ బస్ అమలు, విధి విధానాలపై ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రివర్గ ఉప సంఘం భేటీలో హోంమంత్రి అనిత, మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సంధ్యారాణి పాల్గొన్నారు.
స్త్రీ శక్తి పథకం మార్గదర్శకాలను క్యాబినెట్ సబ్ కమిటీ రూపకల్పన చేసింది. ఎల్లుండి ఈ పథకాన్ని మంత్రివర్గం ఆమోదించనుంది. ఇక ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఉంటుందన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, అల్ట్రా ఎక్స్ ప్రెస్, ఇంటర్ సిటీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయొచ్చని ఆయన తెలిపారు. స్త్రీ శక్తి పథకానికి ఏడాదికి 1950 కోట్ల రూపాయలు ఖర్చు కానుందన్నారు. ఏపీకి చెందిన రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉన్న వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. ఇక ట్రాన్స్ జెండర్లకు కూడా స్త్రీ శక్తి పథకం వర్తించనుంది.
”ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్సు పథకం స్త్రీ శక్తిని ప్రారంభించనున్నాం. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్ సిటీ, ఎక్స్ ప్రెస్, అల్ట్రా ఎక్స్ ప్రెస్.. ఈ ఐదు కేటగిరీల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామం. 100కి 74శాతం ఉన్న కేటగిరీల బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. 6వేల 700 బస్సులను మహిళల ప్రయాణానికి కేటాయించాం. ఇందుకోసం ప్రభుత్వానికి ఏడాదికి రూ.1950 కోట్లు ఖర్చు అవుతుంది.
ఎక్కడా తెలంగాణకు తీసిపోకుండా.. తెలంగాణలో ఏ విధంగా స్కీమ్ ని అమలు చేస్తున్నారో అదే విధంగా మన పథకం ఉంటుంది. వాళ్లు ఏ కేటగిరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారో అంతకన్నా ఎక్కువగా ఏపీలో ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ట్రాన్స్ జెండర్స్ కి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది” అని మంత్రి రాంప్రసాద్ తెలిపారు.
Also Read: ఏపీలో కొత్త బార్ పాలసీ.. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి.. వారికి 10శాతం షాపులు