Perni Nani : బ్రాందీ రేట్లు తగ్గించాలా? సినిమా టికెట్ల రేట్లు పెంచాలా ?
బీహార్ కి ప్రత్యేక హోదా కోసం పరిశీలిస్తున్నామని నీతి ఆయోగ్ చైర్మన్ స్టేట్మెంట్ ఇస్తే మీరేం చేస్తున్నారు..? సూటిగా ప్రశ్నించారు...

ap minister perni Nani fired
Minister Perni Nani Counter to BJP Party : బ్రాందీ రేట్లు తగ్గించాలా ? సినిమా టికెట్ల రేట్లు పెంచాలా ? అని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు మంత్రి పేర్ని నాని. గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ల ధరలపై రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. 2021, డిసెంబర్ 28వ తేదీ మంగళవారం విజయవాడలో బీజేపీ ప్రజాగ్రహ పేరిట సభ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు రావణాసురుడు అయితే ఈ పార్టీలన్నీ తలలుగా ఉన్నాయన్నారు.
Read More : Doctors Strike : ఢిల్లీలో 2,000మంది డాక్టర్ల సమ్మె..బిడ్డ కోసం కన్నీటితో ఓ తల్లి ఆవేదన..
బీహార్ కి ప్రత్యేక హోదా కోసం పరిశీలిస్తున్నామని నీతి ఆయోగ్ చైర్మన్ స్టేట్మెంట్ ఇస్తే మీరేం చేస్తున్నారు..? సూటిగా ప్రశ్నించారు. నీతి ఆయోగ్ చైర్మన్ తో ఎవరు మాట్లాడించారు.. మోదీ కాదా..అని నిలదీశారు. హోదా గురించి… విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామంటున్నా ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు ? బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సభలు పెట్టె పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క లేఖ కూడా రాయలేదనే విషయాన్ని మంత్రి పేర్ని నాని ప్రస్తావించారు.
Read More : Kurnool Crime : తీపిదొంగ.. స్వీట్ షాపులోకి చొరబడి నగదుతో పాటు మిఠాయిలు చోరీ
ఇక ఏపీ రాష్ట్రంలో బలం పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ అయిన అనంతరం బీజేపీ నేతల్లో మార్పు కనిపిస్తోంది. అందులో భాగంగానే మంగళవారం ప్రజాగ్రహ సభ నిర్వహిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు ఈ సభ జరగనుంది. ఇందుకోసం పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. కొంతకాలంగా ప్రభుత్వం తీసుకొచ్చిన పలు జీవోలను, నిర్ణయాలు, సినిమా టికెట్ల ఇష్యూతోపాటు, రాజధాని అమరావతి వ్యవహారంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే అవకాశం ఉంది.