Perni Nani On Chandrababu : బాబు 14ఏళ్లు సీఎంగా ఉన్నా వేస్ట్, మూడేళ్లలోనే జగన్ అన్నీ చేస్తున్నారు-పేర్ని నాని

14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకి ఎందుకు ఇలాంటి ఆలోచన రాలేదు. సొంత నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ తెచ్చుకోలేకపోయారు?(Perni Nani On Chandrababu)

Perni Nani On Chandrababu : బాబు 14ఏళ్లు సీఎంగా ఉన్నా వేస్ట్, మూడేళ్లలోనే జగన్ అన్నీ చేస్తున్నారు-పేర్ని నాని

Perni Nani On Chandrababu

Updated On : April 4, 2022 / 4:49 PM IST

Perni Nani On Chandrababu : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ఆయన విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం జగన్ రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయానికి నేడు నాంది పలికారని మంత్రి పేర్ని నాని అన్నారు. గత 43 ఏళ్లుగా జిల్లాలు పెంచాలని ఎవరూ ఆలోచన చెయ్యలేదన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకి ఎందుకు ఇలాంటి ఆలోచన రాలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఏమైంది? సొంత నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ తెచ్చుకోలేకపోయారు? అని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలు పెంచమని పవన్ కళ్యాణ్ ఎందుకు అడగలేదు? అని మంత్రి నిలదీశారు. 43 ఏళ్లుగా పెరిగిన జనాభా పవన్ కి కనిపించ లేదా..? అని అడిగారు.(Perni Nani On Chandrababu)

Chandrababu Naidu : కల్తీ మద్యం, జే-ట్యాక్స్ పై పోరాటం సాగించాలి

ఏటపాక, కుకునూరు ఏ జిల్లాల్లో ఉన్నాయో కూడా పవన్ కి తెలీదా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో పవన్ చాలా బాధ్యతలు తీసుకున్నారు.. అవన్నీ ఏమయ్యాయి..? అని మంత్రి పేర్ని నాని అడిగారు. జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పవన్ ఏమయ్యారు..? తన అభిప్రాయం ప్రభుత్వంకి ఎందుకు చెప్పలేదు? షూటింగ్ లో ఉండి అవన్నీ పట్టించుకోలేదేమో అని విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబు రాసిచ్చిన నోట్ పై సంతకం పెట్టి విడుదల చేశారని ధ్వజమెత్తారు. 175 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చెయ్యాలని జన సైనికులు కోరుకుంటుంటే టీడీపీతో కలవడానికి పవన్ తాపత్రయ పడుతున్నారని మంత్రి అన్నారు.(Perni Nani On Chandrababu)

సీఎం సీఎం అని కార్యకర్తలు అరుస్తుంటే.. పవన్ మాత్రం చంద్రబాబుని సీఎం చెయ్యాలని చూస్తున్నారని విమర్శించారు. ముందు సొంత పార్టీ కార్యకర్తల డిమాండ్లు నెరవేర్చు. కార్యకర్తల కోరిక మేరకు 175 సీట్లలో పోటీ చెయ్యడంపై దృష్టి పెట్టు అని పవన్ కళ్యాణ్ కు సూచించారు మంత్రి పేర్ని నాని. సీపీఐ నారాయణ, రామకృష్ణ టీడీపీకి గొడుగులా పనిచేస్తున్నారని మంత్రి విమర్శలు గుప్పించారు.

2014 నుండి 2019 మధ్యలో చంద్రబాబుని అఖిలపక్షం వేయమని అడిగారా..? అని ఆయన ప్రశ్నించారు. రాజధాని, ప్రత్యేక హోదా అంశాలపై నిర్ణయాలు తీసుకున్నప్పుడు అఖిలపక్షం అడిగారా..? అని మంత్రి నిలదీశారు. రామకృష్ణ నోరు ఆనాడు లేవలేదు.. ఈరోజు లేస్తుంది.. గొప్పగా బతికిన ఎర్ర జెండాని పసుపు రంగులో కలిపేశారు అని విమర్శించారు. పేదల కోసం పోరాటం చేసింది కమ్యూనిస్టు పార్టీ ఆనాటిది.. అలాంటి పార్టీని ఇద్దరూ దిగజారుస్తున్నారు అని ధ్వజమెత్తారు. రామకృష్ణ, నారాయణ సీపీఐ చంద్రబాబు పార్టీ అని పెట్టుకోవాలన్నారు. వాళ్లిద్దరూ చేసే పనులతో పార్టీ కోసం అసువులుబాసిన వారి ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Laxmi parvathi: ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా నిలిచేలా చంద్రబాబు ఒక్క పనిచేయలేదు.. జగన్ చేసి చూపించారు

ఏపీ శ్రీలంక అవుతుందని చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబుకి అనుభవం ఉన్నా ఏమీ చేయలేకపోయారు, మూడేళ్ల అనుభవంతో జగన్ అన్ని చేస్తున్నారు అని మంత్రి ప్రశంసించారు. మూడేళ్లలో 98 శాతం హామీలు అమలు చేసి చూపించిన ఏకైక సీఎం జగన్ అని కితాబిచ్చారు. జగన్ కి కులం లేదు మతం లేదు అన్నారు. చంద్రబాబులా సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టలేదని మంత్రి పేర్ని నాని అన్నారు. పోలవరం, రంపచోడవరం సమస్యని పరిష్కరించడానికి సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారు అని మంత్రి చెప్పారు.

కాగా, కొత్త జిల్లాల ఏర్పాటుపై చంద్రబాబు విమర్శలు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా ఉందని అన్నారు. ఇది రాజకీయ కోణంలో తీసుకున్న నిర్ణయం అని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాలను సరిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.