Abbayya Chaudhary : చింతమనేనికి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వార్నింగ్
టీడీపీపై దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా తాము కేసులు పెట్టడం మొదలు పెడితే ఈ రోజు టిడిపి నాయకులు ఇళ్లళ్లో ఉండగలరా అని ప్రశ్నించారు.

Abbayya Chaudary
Abbayya Chaudhary warns Chinthamaneni : టీడీపీపై దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా తాము కేసులు పెట్టడం మొదలు పెడితే ఈ రోజు టిడిపి నాయకులు ఇళ్లళ్లో ఉండగలరా అని ప్రశ్నించారు. ఈ రోజు నీ సెంటర్లోనే ఉన్నాను ఖబర్దార్ చింతమనేని ప్రభాకర్.. అంటూ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వార్నింగ్ ఇచ్చారు.
మరోసారి నీనోటి వెంట సీఎం గురించి మాట వస్తే చూస్తూ ఊరుకోబోమని, చర్మం వలిచేస్తామని హెచ్చరించారు. పులి కడుపున పుట్టాను చేతకాక కాదు, తాటతీస్తా గుర్తుపెట్టుకో అని అన్నారు. నియోజకవర్గంలోని తమ కార్యకర్తలంతా ఓర్పుతో ఉన్నారని పేర్కొన్నారు. తాను సై అంటే చర్మం వలిచేస్తారని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.
దుగ్గిలలో 10 సంవత్సరాల నుండి అంబేద్కర్ విగ్రహం పెడతాం అంటే అడ్డుపడ్డావని చెప్పారు. నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి తమకు ఈ అవకాశం కల్పించారని పేర్కొన్నారు. రాజన్న (వైఎస్సార్) తమ నుండి దూరమై నేటికీ 12 సంవత్సరాలు గడిచాయని పేర్కొన్నారు. దెందులూరు నియోజకవర్గంలో 750 కోట్లు రూపాయలతో అభివృద్ధి చేశామని తెలిపారు.