Nadendla Manohar: సలహాదారుల ఖర్చుపై నాదెండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు

ఏపీ ప్రభుత్వం అవసరానికి మించి సలహాదారులను నియమించిందని, హైకోర్టు మొట్టికాయలు వేసిందని తెలిపారు.

Nadendla Manohar: సలహాదారుల ఖర్చుపై నాదెండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు

Nadendla Manohar

Updated On : February 1, 2024 / 4:47 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నియమించుకున్న సలహాదారుల ఖర్చుపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు చేశారు. సలహాదారుల ఖర్చు రూ.680 కోట్లు ఖర్చు అయిందన్నారు. సజ్జలకే ఈ ఐదేళ్ల కాలంలో రూ.140 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు.

ఏపీ ప్రభుత్వం అవసరానికి మించి సలహాదారులను నియమించిందని, హైకోర్టు మొట్టికాయలు వేసిందని తెలిపారు. సలహాదారులు కూడా సీఎం జగన్‌ను కలవలేకపోతున్నారని చెప్పారు. కొద్దిమంది సలహాదారులు ఇక్కడి వ్యవస్థను చూసి రాజీనామా చేసేశారని తెలిపారు.

సుభాష్ గార్గ్, రామ చంద్రమూర్తి వంటి సలహాదారులు రాజీనామాలు చేశారన్నారు. 80-90 సలహాదారులకు ఈ ప్రభుత్వం రూ. 680 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పారు. వీళ్లేం సలహాలిస్తున్నారని, ప్రభుత్వం ఏం పాటిస్తుందని నిలదీశారు.

ఐబీ వంటి సంస్థతో ఒప్పందం చేసుకోవాలని ఏ సలహాదారు చెప్పారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. అసలు ఎంత మంది సలహాదారులు ఉన్నారో సీఎం జగనుకైనా తెలుసా అని అడిగారు. సలహాదారుల జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులను, అధికారులను వినియోగించుకోకుండా సలహాదారులతో పనేంటన్నారు.

సీట్ల ఖరారుపై కూడా నాదెండ్ల స్పందించారు.. పూర్తి వివరాలు..