Nara Lokesh: పిల్ల బచ్చాకు చెబుతున్నా.. టైం, డేట్ నిర్ణయించాలి: నారా లోకేశ్

హాఫ్ నాలెడ్జ్ వ్యక్తికి ఇరిగేషన్ శాఖ ఇచ్చారని నారా లోకేశ్ మండిపడ్డారు.

Nara Lokesh: పిల్ల బచ్చాకు చెబుతున్నా.. టైం, డేట్ నిర్ణయించాలి: నారా లోకేశ్

Nara Lokesh

Updated On : June 28, 2023 / 8:26 PM IST

Nara Lokesh – TDP: వైసీపీ (YCP) నేతలపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఉమ్మడి నెల్లూరు (Nellore) జిల్లా కోటలో నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేశ్ మాట్లాడారు. నెల్లూరు జిల్లాకి వైసీపీ నేతలు చేసింది సున్నా అని చెప్పారు.

” నెల్లూరు జిల్లాను గంజాయి, బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చారు. హాఫ్ నాలెడ్జ్ వ్యక్తికి ఇరిగేషన్ శాఖ ఇచ్చారు. పిల్ల బచ్చాకు చెబుతున్నా.. టైం, డేట్ మీరే నిర్ణయించండి చర్చకు నేను సిద్ధం. చర్చకు జగన్ ను తీసుకువచ్చి సిటీ సీట్ పిల్లబచ్చాకి ఇస్తున్నానని చెప్పమనండి చూద్దాం ” అని అన్నారు.

అకాల వర్షాలతో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటే వ్యవసాయ శాఖ మంత్రి రైతులను ఆదుకున్నారా అని లోకేశ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే వరప్రసాద్ గూడూరుకి చేసిన ఒక్క మంచి పని లేదని చెప్పారు. వరప్రసాద్ కు వైసీపీ నాయకులే కలెక్షన్ ప్రసాద్ గా పేరు పెట్టారని అన్నారు. చిల్లకూరులో గ్రావెల్ మాఫియాను రప్రసాద్, ఆయన కుమారుడు నడుపుతున్నారని ఆరోపించారు.

యువగళం దెబ్బకి జగన్ కి జ్వరం వచ్చిందని నారా లోకేశ్ చెప్పారు. తన యాత్రను సాగనిస్తే పాదయాత్ర అవుతుందని, అడ్డుకుంటే మాత్రం దండయాత్ర అవుతుందని హెచ్చరించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు ప్రత్యేక చట్టాలు తీసుకువస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమం ఏపీలో జరుగుతోందని నారా లోకేశ్ అన్నారు.

YS Sharmila : 9ఏళ్లలో 9వేల మంది రైతులను పొట్టన పెట్టుకున్న మీరు రైతుల పక్షమా? సీఎం కేసీఆర్ పై షర్మిల ఫైర్