No Corona Fear : కరోనా అంటే భయం లేదా? డబ్బు కోసం ఎగబడ్డారు

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో బ్యాంకులు ముందు రైతులు బారులు తీరారు. రైతు భరోసా పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లోకి రెండు రోజుల క్రితం డబ్బులు జమచేశాయి. ఆ డబ్బులు డ్రా చేసుకోవడానికి వెంకటగిరిలోని ఎస్బీఐ, విజయా బ్యాంకు, సిండికేట్ బ్యాంకుల ముందు రైతులు బారులు తీరారు. కరోనాను లెక్క చేయకండా పెద్ద సంఖ్యలో వచ్చారు. డబ్బులు తీసుకోవడానికి ఎగబడ్డారు.

No Corona Fear : కరోనా అంటే భయం లేదా? డబ్బు కోసం ఎగబడ్డారు

No Corona Fear

Updated On : May 19, 2021 / 7:16 PM IST

No Corona Fear : నెల్లూరు జిల్లా వెంకటగిరిలో బ్యాంకులు ముందు రైతులు బారులు తీరారు. రైతు భరోసా పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లోకి రెండు రోజుల క్రితం డబ్బులు జమచేశాయి. ఆ డబ్బులు డ్రా చేసుకోవడానికి వెంకటగిరిలోని ఎస్బీఐ, విజయా బ్యాంకు, సిండికేట్ బ్యాంకుల ముందు రైతులు బారులు తీరారు. కరోనాను లెక్క చేయకండా పెద్ద సంఖ్యలో వచ్చారు. డబ్బులు తీసుకోవడానికి ఎగబడ్డారు. బ్యాంకుల దగ్గర ఒక్కసారిగా రద్దీ పెరిగింది. కొందరు మాస్కులు పెట్టుకోలేదు. భౌతిక దూరం అసలే పాటించలేదు. పోలీసులు, బ్యాంకు సిబ్బంది వారికి నచ్చ చెప్పి దూరంగా నిలబట్టే ప్రయత్నం చేసినా జనాలు మాత్రం పట్టించుకోలేదు. భౌతిక దూరం మర్చిపోయి ఒకరిపై ఒకరు పడ్డారు. చేసేదేమీ లేక బ్యాంకు సిబ్బంది సైతం చేతులెత్తేశారు.

నిజానికి భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, అలాంటివేమీ పాటించడం లేదు. ఒకరి మీద ఒకరు పడిపోయారు. కరోనా ప్రమాదకరం అని.. మాస్కులు పెట్టుకోవాలని, ఆరు అడుగుల దూరం పాటించాలని తెలిసినా ప్రజలు జాగ్రత్త పడటం లేదు. ఇలాంటి నిర్లక్ష్యంతోనే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.