Pawan Kalyan: 50 మందిని చంపాలని పథకం.. చంద్రబాబుకి నా మద్దతు.. ఇక ఊరుకోం.. వస్తున్నాం: పవన్
శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు.

Pawan Kalyan
Pawan Kalyan- Chandrababu Remand : వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఏసీబీ (ACB) కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ (Judicial) రిమాండ్ విధించడంతో దీనిపై పవన్ కల్యాణ్ ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడారు.
కోనసీమ జిల్లాలో 2 వేల మంది నేరగాళ్లను దింపారని, 50 మందిని చంపేయాలని పథకం పన్నారని పవన్ ఆరోపించారు. శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు.
ప్రశ్నించే వారిపై హత్య కేసులు నమోదు చేస్తున్నారని పవన్ అన్నారు. శనివారం తనను అన్ని రకాలుగా అడ్డుకుకున్నారు కనుకే రోడ్డుపై పడుకుని నిరసన తెలిపానని చెప్పారు. తనలాంటి వాడికే ఇలాంటి నిర్బంధం ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన నిలదీశారు. తాను రోడ్డుపై పడుకుని నిరసన తెలిపేలా చేసింది వైసీపీ వాళ్లేనని చెప్పారు.
మన కోసం ఒక వ్యక్తి నిలబడినప్పుడు వారికి మద్దతు ఇవ్వడం పద్ధతి అని పవన్ కల్యాణ్ అన్నారు. నాయకుడిని అరెస్టు చేస్తే మద్దతుగా అభిమానులు వస్తారని అన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో భాగమేనని చెప్పారు.
భయపడేవారు ఎవరూ లేరు
తణుకు, భీమవరంలో వారాహి యాత్రపై దాడి చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ప్రజలను, ప్రశ్నించే వారిని భయభ్రాంతులను చేసేందుకు ప్రయత్నించారని పవన్ చెప్పారు. ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరని అన్నారు. అసలు చట్టాలు సరిగ్గా పనిచేస్తే బెయిల్ పై వచ్చిన వారు సీఎం కాలేరని, అక్రమంగా డబ్బు సంపాదించిన వారు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు.
ఓ వైపు జీ20 వంటి పెద్ద సదస్సు..
ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులతో ప్రతిపక్షాలకు బలం పెరిగిందని చెప్పారు. ఓ వైపు జీ20 వంటి పెద్ద సదస్సు జరుగుతుంటే, మరోవైపు ఇక్కడ నాయకులను అరెస్టులు చేశారని అన్నారు. ప్రపంచ దేశాల అధ్యక్షులు వచ్చిన సమయంలో అలజడులు సృష్టించారని మండిపడ్డారు. జీ20ని డైవర్ట్ చేయడానికే ఈ అరెస్టులు చేసినట్లు ఉందని చెప్పారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తానని అన్నారు.
Chandrababu Remand: ఈ నెల 22 వరకు చంద్రబాబుకి జ్యుడీషియల్ రిమాండ్.. బెయిల్ పిటిషన్ దాఖలు