Pawan Kalyan: అప్పుడు నాకు చాలా బాధ కలిగింది.. వైసీపీ మరోసారి గెలిస్తే..: పవన్ కల్యాణ్

రాజకీయాల్లో చంద్రబాబుకి సుదీర్ఘ అనుభవం ఉందని అన్నారు. గతంలో కేంద్రంలోనూ గొప్ప పాత్ర పోషించారని చెప్పారు.

Pawan Kalyan: అప్పుడు నాకు చాలా బాధ కలిగింది.. వైసీపీ మరోసారి గెలిస్తే..: పవన్ కల్యాణ్

Pawan Kalyan

Updated On : December 20, 2023 / 8:33 PM IST

JanaSena: వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద యువగళం-నవశకం పేరుతో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో పవన్ మాట్లాడారు.

చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు తనకు చాలా బాధ కలిగిందని చెప్పారు. రాజకీయాల్లో చంద్రబాబుకి సుదీర్ఘ అనుభవం ఉందని అన్నారు. గతంలో కేంద్రంలోనూ గొప్ప పాత్ర పోషించారని చెప్పారు. చంద్రబాబు నాయుడిపై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు దిగిందని అన్నారు. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకు మద్దతు తెలపాలనుకున్నానని చెప్పారు.

జగన్ చేసిన తప్పులకు ఆయనను సోనియా గాంధీ జైల్లో పెట్టించారని పవన్ అన్నారు. ఆ కక్షను జగన్ ఇప్పుడు చంద్రబాబుపై చూపటం అన్యాయమని వ్యాఖ్యానించారు. తాను కష్టాలు చూసిన వాడినని, అనుభవించిన వాడినని చెప్పారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తి తమలో ఉందని తెలిపారు.

Also Read: Chandrababu Naidu: అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయింది.. రాష్ట్రం మొత్తం..: చంద్రబాబు

పవన్ కల్యాణ్ కామెంట్స్

  • భవిష్యత్తులో మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే మరిన్ని కష్టాలు ఎదురవుతాయి
  • ఏదైనా మాట్లాడితే, ప్రశ్నిస్తే దూషిస్తున్నారు
  • తల్లికి, చెల్లికి విలువ ఇవ్వని వ్యక్తి జగన్
  • ఇక రాష్ట్రంలోని ఇతర ఆడపడుచులకు ఏం విలువ ఇస్తారు?
  • వారాహి యాత్ర వేళ నాపై దాడులకు ప్రయత్నించారు
  • వైసీపీ మరోసారి వస్తే, ఇళ్లలో కూడా ఎవ్వరూ ఉండలేరు
  • జగన్ మీద వ్యక్తిగతంగా కోపం లేదు
  • రాష్ట్రంలో పాలన కొనసాగుతున్న తీరు బాగోలేదు
  • ఎన్నికల వేళ మార్చాల్సింది వైసీపీ ఎమ్మెల్యేలను కాదు.. సీఎం జగన్‌ను మార్చాలి
  • నేను టీడీపీకి మద్దతు ఇస్తోంది ఏదో ఆశించి కాదు
  • సీఎం జగన్‌కు ప్రజాస్వామ్య విలువ తెలియదు
  • 2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
  • మేము మార్పు తీసుకువస్తాం
  • వైఎస్ జగన్‌ను ఇంటికి పంపుతాం
  • వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వం
  • తెలుగుదేశం-జనసేన పొత్తుని బీజేపీ అధినాయకత్వం ఆశీర్వదిస్తుందని ఆశిస్తున్నా
  • ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుపడేవరకు తెలుగుదేశం-జనసేన పొత్తు కొనసాగాలి
  • త్వరలోనే మరో భారీ బహిరంగ సభలో తెలుగుదేశం-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోను ప్రకటిస్తాయి
  • వైసీపీ చేసిన ప్రతి ఆరాచకాన్ని అమిత్ షాకి వివరించాను
  • ఏపీ భవిష్యత్తు మారాలంటే, రాష్ట్రంలో వైసీపీ పోవాలని కేంద్ర నాయకత్వానికి స్పష్టం చేశా
  • 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు మాత్రమే ఆశించి టీడీపీతో జత కట్టాను