Janasena : 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం కావడం ఖాయం : జనసేన
సొంతంగా సీఎం అయ్యే శక్తి జనసేనకు ఉన్నా.. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యానే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంతో సఖ్యత ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే బీజేపీతో జనసేన మిత్రపక్షంగా కొనసాగుతుందన్నారు.

Pawan Kalyan
Janasena party : రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నట్లు జనసేన పార్టీ నేతలు తెలిపారు. పొత్తు ఉన్నా లేకపోయినా 2024లో సీఎం పవన్ కళ్యానేని స్పష్టం చేశారు. ఈ మేరకు జనసేన నేతలు కిరణ్ రాయల్, హరిప్రసాద్, రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నుండి సానుకుల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. పొత్తులు ఉన్నా లేకున్నా జనసేననే అధికారంలోకి వస్తుందని చెప్పారు.
సొంతంగా సీఎం అయ్యే శక్తి జనసేనకు ఉన్నా.. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యానే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంతో సఖ్యత ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే బీజేపీతో జనసేన మిత్రపక్షంగా కొనసాగుతుందన్నారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన నేతలు బీజేపీకి అల్టిమేటమ్ జారీ చేశారు.
Janasena Alleged : టీటీడీ ఆస్తులు మొత్తం కాజేస్తున్నారు : జనసేన
బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన నేతలు డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా విజయవాడ పర్యటనలోనే పవన్ కళ్యాణ్‌ను రెండు పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీజేపీలో సీఎం అయ్యే స్థాయి వ్యక్తులు ఎవరూ లేరని తెలిపారు.
ఏపీలో అధికార పార్టీపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని..మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని ప్రధాని మోదీ అన్నారని గుర్తుచేశారు. ‘మీరు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాంరో.. లేక చెవిలో పువ్వులు పెడతారో రెండు రోజుల్లో తెలుస్తుంది’ అని అన్నారు. జేపీ నడ్డా పర్యటన తర్వాత తదుపరి కార్యాచరణ జనసేనదేనని జనసేన నేతలు స్పష్టం చేశారు.