ఆయనకు ఈ వయసులో ఎందుకీ పాపం?: పేర్ని నాని

ఇప్పుడు పెన్షన్లు పంపిణీ జరగకుండా చంద్రబాబు, ఆయన మద్దతుదారులు అడ్డుకున్నారని చెప్పారు.

ఆయనకు ఈ వయసులో ఎందుకీ పాపం?: పేర్ని నాని

Perni Nani

Perni Nani: పెన్షన్లు 1వ తేదీన ఇచ్చిన ఘనత వైసీపీదేనని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. అమరావతలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పెన్షన్లపై చంద్రబాబువి దొంగ నాటకాలని చెప్పారు. ఆయనకు ఈ వయసులో ఎందుకీ పాపం అని నిలదీశారు. ఇంటికి వెళ్లి పెన్షన్ ఇస్తే ఓటేస్తారా? అని అన్నారు. జగన్ పరిపాలన అంటే చంద్రబాబుకి భయమని అన్నారు.

ఏ రోజైనా కమ్మకులస్థులకు చంద్రబాబు మేలు చేశారా అని అడిగారు. జగన్‌కి కులం లేదని, అన్ని కులాలు జగన్ వెంట ఉన్నాయని చెప్పారు. వాలంటీర్లకు పాదాభివందనాలని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు భయంతో సచివాలయాల దగ్గర తిరుగుతున్నారని చెప్పారు. 58 నెలలుగా ఒకటవ తేదీన ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశామని తెలిపారు.

ఇప్పుడు పెన్షన్లు పంపిణీ జరగకుండా చంద్రబాబు, ఆయన మద్దతుదారులు అడ్డుకున్నారని చెప్పారు. పెన్షన్ లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత వచ్చాకా ఇప్పుడు ప్రేమ వలకపోస్తున్నారని తెలిపారు. సచివాలయ వ్యవస్థ గొప్పతనం టీడీపీకి ఇప్పటికైనా అర్థం అయ్యిందని అన్నారు. 1.60 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని టీడీపీ నేతలే ఒప్పుకున్నారని తెలిపారు.

ప్రజలు ఐదేళ్ల పాలన చూసి ఓటు వేస్తారని, చివరి రెండు నెలలు కాదని తెలిపారు. చివరి రెండు నెలల్లో డబ్బులు ఇస్తే ఓట్లు వెయ్యరని చెప్పారు. గతంలో టీడీపీ పసుపు కుంకుమ పథకం అమలు చేసిందని, అయినా ఓట్లు పడలేదని తెలిపారు. ఎన్నికల వేళ ఇప్పుడు మండే ఎండల్లో వృద్దులు రోడ్లపై వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని, ఆ ఉసురు టీడీపీకే తగులుతుందని మండిపడ్డారు.

Also Read: బీజేపీలో ఉన్నాను.. టికెట్ ఇస్తే ఏపీలో పోటీ చేస్తా: జయప్రద