దట్టమైన అడవిలో… భుజం కాసి… శభాష్ పోలీస్

దట్టమైన అడవిలో గుర్తుతెలియని మృతదేహం కనిపించగా.. వాహనం వెళ్లేందుకు దారిలేక ఓ కానిస్టేబుల్‌ మరో వ్యక్తి సహాయంతో ఒకటిన్నర కిలోమీటరు దూరం భుజంపై మోసుకొచ్చిన సంఘటన ఇది.

దట్టమైన అడవిలో… భుజం కాసి… శభాష్ పోలీస్

Police Carrying Found Unknown Deadybody

Updated On : April 30, 2021 / 2:28 PM IST

Police carrying Found Unknown Deadybody : దట్టమైన అడవిలో గుర్తుతెలియని మృతదేహం కనిపించగా.. వాహనం వెళ్లేందుకు దారిలేక ఓ కానిస్టేబుల్‌ మరో వ్యక్తి సహాయంతో ఒకటిన్నర కిలోమీటరు దూరం భుజంపై మోసుకొచ్చిన సంఘటన ఇది. వివరాలిలా ఉన్నాయి.. పెద్దదోర్నాల మండలంలోని నల్లమల అటవీ ప్రాంతం మర్రిపాలెం చెంచు గిరిజన గూడెం సమీపంలో గురువారం ఓ మృతదేహం కనిపించింది. దాదాపు 50 నుంచి 60 ఏళ్ల వయసున్న పురుషుడిగా గుర్తించిన చెంచు గిరిజనులు పెద్దదోర్నాల పోలీసులకు సమాచారం అందించారు.

హెడ్‌ కానిస్టేబుళ్లు సురేష్, నాగరాజు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం నల్లమల లోతట్టు ప్రాంతంలో ఉండటంతో వాహనాలు వెళ్లేందుకు వీలుకాలేదు. దీంతో సురేష్, మరో ఆటో డ్రైవర్‌ సహాయంతో మృతదేహాన్ని భుజాలపై మోసుకొని మర్రిపాలెం గూడేనికి తీసుకువచ్చారు.

అక్కడినుంచి శవపరీక్ష నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. చనిపోయిన వ్యక్తి గత మూడురోజులుగా గూడెంలో సంచరిస్తున్నాడని, మార్కాపురంలో కూరగాయలు విక్రయిస్తుంటానని తమకు చెప్పాడని స్థానికులు తెలిపారు. మృతదేహంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో వడదెబ్బ లేదా అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.