నెల్లూరులో దాడి కేసులో ట్విస్ట్.. కారు కారణంగానే కొట్టారు

  • Published By: vamsi ,Published On : November 17, 2020 / 07:39 PM IST
నెల్లూరులో దాడి కేసులో ట్విస్ట్.. కారు కారణంగానే కొట్టారు

Updated On : November 17, 2020 / 7:44 PM IST

అల్లరిమూక రెచ్చిపోయి ఓ వ్యక్తిని పబ్లిక్‌గా విచక్షణారహితంగా కర్రతో అంత్యంత దారుణంగా కొట్టిన వీడియో వైరల్ అవగా.. ఈ దాడి విషయంలో కొత్త కోణాన్ని పోలీసులు బహిర్గతం చేశారు. బెదిరింపులకు దిగి యుగంధర్ అనే యువకుడిపై రాజశేఖర్ దాడి చేశాడు. అయితే అందుకు కారణం కారును తీసుకెళ్లి డ్యామేజ్ చెయ్యడమే అని వెల్లడించారు పోలీసులు.



యుగంధర్ కారును తీసుకెళ్లి డేమెజ్ చేయగా.. యుగంధర్‌ను డబ్బులు చెల్లించమని కిశోర్ అడిగాడు. అయితే డబ్బులు చెల్లించకపోవడంతో యుగంధర్‌ను విచక్షణారహితంగా కొట్టాడు రాజశేఖర్. మూడు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెండు వేరు వేరు ఘటనలపై ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు.



అయితే ఈ ఘటన గురించి పోలీసులు వెంటనే అప్రమత్తం అయి విచారించారు. ఐపీఎల్ బెట్టింగ్ కారణంగా కొట్టారని వార్తలు రాగా.. కాదని స్పష్టం చేశారు పోలీసులు.. కారు కారణంగానే కొట్టినట్లుగా చెప్పారు. ఈ కేసులో రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

https://www.youtube.com/watch?v=7TucGUvww6A