Contract Job Vacancies : పశ్చిమ గోదావరి జిలాల్లో వైద్య,ఆరోగ్య శాఖలో ఒప్పంద ఉద్యోగ ఖాళీల భర్తీ
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీఎంఎల్‌టీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి వారు అర్హులు. అభ్యర్ధుల వయసు18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

Medical and Health Department in West Godavari
Contract Job Vacancies : ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈనోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల వివరాలకు సంబంధించి మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, కౌన్సెలర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, కమ్యూనిటీ కేర్ కోఆర్డినేటర్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీఎంఎల్‌టీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి వారు అర్హులు. అభ్యర్ధుల వయసు18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్ మెరిట్ మార్కులు, సంబంధిత పనిలో అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక ఉంటుంది. పోస్టును బట్టి నెలకు రూ.18,000ల నుంచి రూ.72,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 20, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://westgodavari.ap.gov.in/ పరిశీలించగలరు.