రోడ్డు ప్రమాదం – కారు టాప్ లేచి పోయింది

రోడ్డు ప్రమాదం – కారు టాప్ లేచి పోయింది

Updated On : January 12, 2021 / 2:31 PM IST

Road accident in nellore district : టాప్ లేచిపోయింది ఏంటా అనుకుంటున్నారా….అవును నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కారు టాప్ లేచిపోయింది. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయట పడి ప్రాణాలు దక్కించుకున్నారు.  మంగళవారం ఉదయం తిరుపతి నుంచి నెల్లూరుకు  బయలు దేరిన ఒక కారు వేగంగా వస్తోంది.

అదే సమయంలో నెల్లూరు జిల్లాలోని వీరంపల్లి క్రాస్ రోడు వద్ద, పొదలకూరు నుంచి చెన్నై వెళ్లాల్సిన కట్టెల లారీ జాతీయ రహాదారిపైకి రావటానికి, రోడ్డు దాటుతోంది. తిరుపతి నుంచి వేగంగా వస్తున్న కారు డ్రైవర్ కట్టెల లారీని దగ్గరకు వచ్చే దాకా గమనించలేదు. కారును కంట్రల్ చేసే క్రమంలో. అదుపు తప్పి లారీని ఢీ కొట్టింది. లారీలో ఉన్న కట్టెలు తగిలి కారు టాప్ లేచిపోయింది. కారులో ప్రయాణిస్తున్న భార్యా భర్త, చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.