AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన

ఆదివారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనం సముద్రంలోనే పూర్తిగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ, అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ..

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన

AP Rains

Updated On : December 23, 2024 / 6:56 AM IST

Heavy Rains In Andhrapradesh: ఏపీని వరుణుడు వీడలేదు. పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ మంగళవారం నాటికి ఉత్తర తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్తుందని వాతావరణ శాఖ తెలిపింది.

AP Rains

తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో గురువారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

AP Rains

బుధవారం వరకు సముద్రంలో గంటకు గరిష్టంగా 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రంలోని పోర్టులకు మూడో నంబరు హెచ్చరికను జారీ చేశారు.

AP Rains

ఆదివారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనం సముద్రంలోనే పూర్తిగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ, అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా (ఏపీ) తీరాల వైపు పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీని ప్రభావం గురువారం వరకు ఉంటుంది. అయితే, అల్పపీడనం తీరానికి చేరువగా వెళ్తుందా లేక తీరం దాటుతుందా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

AP Rains

ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రైతులు సాగుచేసిన పంటలు చేతికొచ్చే సమయంలో వర్షం ముప్పు పొంచి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.