Mega Solar Project Tenders : మెగా సోలార్ ప్రాజెక్టులపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు సస్పెండ్

మెగా సోలార్‌ ప్రాజెక్ట్‌ టెండర్లను రద్దు చేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సస్పెండ్‌ చేసింది.

Mega Solar Project Tenders : మెగా సోలార్ ప్రాజెక్టులపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు సస్పెండ్

Ap High Court

Updated On : July 20, 2021 / 10:48 PM IST

Mega Solar Project Tenders : మెగా సోలార్‌ ప్రాజెక్ట్‌ టెండర్లను రద్దు చేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సస్పెండ్‌ చేసింది. సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేయగా, విచారణ చేపట్టిన న్యాయస్థానం.. టెండర్లకు సంబంధించి ఒప్పందాలు చేయొద్దని ఆదేశించింది.

కౌంటర్లు దాఖలు చేయాలని టాటా పవర్‌ ఎనర్జీ, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చేనెల 16కు కోర్టు వాయిదా వేసింది. కాగా, 400 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను వ్యవసాయానికి ఇవ్వడానికి గతేడాది నవంబర్‌లో ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే.