పాత పెద్దారెడ్డిని చూపిస్తా.. నా సహనాన్ని పరీక్షించొద్దు; జేసీకి వార్నింగ్

తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల తర్వాత పాత పెద్దారెడ్డిని చూస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు.

పాత పెద్దారెడ్డిని చూపిస్తా.. నా సహనాన్ని పరీక్షించొద్దు; జేసీకి వార్నింగ్

Tadipatri mla kethireddy pedda reddy sensational comments On JC brothers

Updated On : December 27, 2023 / 5:12 PM IST

Kethireddy Pedda Reddy: వచ్చే ఎన్నికల తర్వాత తన అసలు రూపం చూపిస్తానని, మళ్ళీ పాత పెద్దారెడ్డిని చూస్తారంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రత్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉనికి కోసం జేసీ రాద్ధాంతం చేస్తున్నారని, తాడిపత్రిలో గొడవలు సృష్టించి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రతి రోజూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని, తన సహనాన్ని పరీక్షించొద్దని వార్నింగ్ ఇచ్చారు. అవినీతి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.

పెద్దారెడ్డి ఇంకా ఏమన్నారంటే?
నాలుగు నెలల తర్వాత నా అసలు రూపం చూపిస్తా
2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా నా ప్రత్యర్ధులను వదిలే ప్రసక్తి లేదు
పంటకు చీడ పురుగు ఎంత ప్రమాదమో.. రాజకీయాల్లో ఉన్న చీడ పురుగులను ఏరివేస్తా

నా ఓర్పు, సహనాన్ని పరిక్షీస్తున్న వారికే ఈ వార్నింగ్
2024 ఎలక్షన్ తర్వాత మళ్ళీ పాత పెద్దారెడ్డిని చూస్తారు
జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు జారితే ఊరుకునేది లేదు
నాపై కరపత్రాలు వేసి అసత్య ప్రచారం చేస్తున్నారు
నా ఆస్తులన్నీ సక్రమమే.. ఉనికి కోసం జేసీ రాద్ధాంతం చేస్తున్నారు

Also Read: హాట్ టాపిక్‌గా కొడాలి నాని, వంగవీటి రాధ కలయిక.. ఏం జరుగుతోంది?

తాడిపత్రిలో గొడవలు సృష్టించి సానుభూతి పొందేందుకు జేసీ కుట్రలు చేస్తున్నారు
తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న చీడ పురుగులను ఏరేస్తా.. ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలి
జేసీ ప్రభాకర్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు
జెండాలు తొలగించకుండా సుందరీకరణ పనులు చేస్తామని జేసీ లేఖ ఇచ్చారు
ఇప్పుడేమో వైసీపీ జెండాలు తొలగించాలని జేసీ ఆందోళన చేయడం హాస్యాస్పదం
జేసీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు
బినామీ పేర్లతో తాడిపత్రి మున్సిపల్ ఆస్తులను జేసీ కొల్లగొట్టారు

తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్తత
తాడిపత్రిలో నగర సుందరీకరణ పనులు చేస్తుంటే వైసీపీ నాయకులు జెండాలు కట్టారని ఆరోపిస్తూ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. పోలీస్టేషన్ ముందు రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా తనదైన శైలిలో ఆయన విరుచుకుపడ్డారు. పోలీసులు తమ జీపులో ఆయనను ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. మార్గ మధ్యలో జీపు ఆపి రోడ్డుపై తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ చేపట్టారు. దీంతో తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.